Beni Prasad Verma
-
కరోనాతో కేంద్ర మాజీ మంత్రి కుమారుడు మృతి
లక్నో : ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తూనే ఉంది. కరోనాకు సామాన్యులు, ప్రముఖులు అన్న తేడా లేదు. ఇప్పటికే ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి బేణి ప్రసాద్ వర్మ కుమారుడు దినేష్ వర్మ (40) మంగళవారం కరోనా కారణంగా మరణించాడు. స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్లో ప్రభుత్వ ఉద్యోగి అయిన దినేష వర్మకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లక్నో నగరానికి చెందిన దినేష్‌కు కొద్ది రోజుల క్రితమే కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. అయితే గతంలోనూ దినేష్ వర్మకు కిడ్నీ సంబంధిత సమస్యలున్నట్లు సమాచారం. 2007లో దినేష్ మూత్రపిండ మార్పిడి చేయుంచుకున్నాడని అప్పటినుంచి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన స్నేహితుడు వెల్లడించారు. (మార్నింగ్ వాక్కు వెళ్లిన బీజేపీ అధ్యక్షుడిపై దాడి ) కాగా సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడైన బేణిప్రసాద్ వర్మ కాంగ్రెస్ హయాంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా పనిచేశారు. అనారోగ్య సమస్యలతో ఈ ఏడాది మార్చి 27న మరణించారు. నెలల వ్యవధిలోనే ఇప్పుడు కూమారుడు కూడా చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు బేణిప్రసాద్ వర్మకు ములాయం సింగ్‌తో ఎంతో సాన్నిహిత్యం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ దినేష్ వర్మ కుటుంబానికి సంతాపం తెలిపారు. (కరోనా ఔషధం : పతంజలి కొత్త ట్విస్టు ) -
మాజీ కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మ కన్నుమూత
లక్నో: కేంద్ర మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు బేణీ ప్రసాద్ వర్మ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం సాయం త్రం లక్నోలోని ఓ ఆస్పత్రిలో కన్ను మూశారు. 1996–98 కాలంలో అప్పటి ప్రధాని హెచ్డీ దేవెగౌడ మంత్రివర్గంలో టెలికాం మంత్రిగా, యూపీఏ 2 హయాంలో స్టీల్ మంత్రిగా పనిచేశారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
రాహుల్‌ను పక్కనపెట్టే కుట్ర: బేణీ ప్రసాద్ వర్మ
లక్నో: కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబాన్ని ముఖ్యంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని పక్కన పెట్టేందుకు కొందరు సొంత పార్టీ నేతలే ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బేణీ ప్రసాద్ వర్మ సోమవారం ఆరోపించారు. ఇతర పార్టీలతో సంబంధాలు పెట్టుకున్న కొందరు నేతలు కావాలనే ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని, ఇటీవలి ఎన్నికల్లో వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని.. ప్రత్యేకంగా ఎవరి పేరునూ ప్రస్తావించకుండా ఆయన విమర్శించారు. ఎన్నికల్లో టికెట్లను అమ్ముకుని, కోట్లాది రూపాయలు సంపాదించి.. ఇప్పుడు అధినాయకత్వాన్ని విమర్శిస్తున్న వారెవరో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. దేశంలో మోడీకి దీటైన నేత రాహుల్ గాంధేనంటూ పార్టీ ఉపాధ్యక్షుడిపై బేణీ ప్రశంసలు గుప్పించారు. -
గాంధీ కుటుంబాన్ని పక్కన పెట్టేస్తున్నారు
ఇతర పార్టీలతో సంబంధాలు పెట్టుకున్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు గాంధీ కుటుంబాన్ని.. ముఖ్యంగా ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పక్కన పెట్టేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బేణీప్రసాద్ వర్మ ఆరోపించారు. పార్టీలోనే ఉంటూ నాయకత్వాన్ని విమర్శిస్తున్న వాళ్లు ఇతర పార్టీలతో సంబంధాలు పెట్టుకున్నారన్నారు. అయితే ఏ ఒక్కరి పేరును ఆయన ప్రస్తావించలేదు. వాళ్ల పేర్లు, ముఖాలు అందరికీ తెలుసని మాత్రం చెప్పారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లే టికెట్లు అమ్ముకుని భారీగా సొమ్ము వెనకేసుకున్నారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా వాళ్లు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్నారు. ఇంతకుముందు రాహుల్ గాంధీని పొగిడినవాళ్లే ఇప్పుడు ఆయన నాయకత్వ లక్షణాలను ప్రశ్నించడం సత్సంప్రదాయం కాదని బేణీ ప్రసాద్ వర్మ చెప్పారు. దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీయేనని, ఆయన మాత్రమే నరేంద్రమోడీని ఢీకొనగలరని అన్నారు. ఆయనకు రాజకీయాలు, సమాజం, ఆర్థికవ్యవస్థపై లోతైన పరిజ్ఞానం ఉందని కూడా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలో వస్తుందని, పార్టీని పునర్వ్యవస్థీకరించడానికి రాహుల్ త్వరలోనే చర్యలు తీసుకుంటారని బేణీ తెలిపారు. -
మోడీ ఓ జంతువు: బేణీప్రసాద్
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీపై అనుచిత వ్యాఖ్యల విషయంలో కేంద్ర మంత్రి బేణీప్రసాద్‌వర్మ వెనక్కి తగ్గలేదు. ఎన్నికల సంఘం షోకాజు నోటీసు జారీ చేసిన మర్నాడే ఆయన మరోసారి మోడీపై దూషణకు దిగారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో కాంగ్రెస్ కార్యకర్తల ర్యాలీలో మాట్లాడుతూ నరేంద్రమోడీ ఓ జంతువు అని, ఆయన గుణపాఠం నేర్వాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు మోడీపై వర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నాయని భావించిన ఈసీ గురువారం ఆయనకు షోకాజు నోటీసు జారీ చేసింది. మోడీ ఓ పెద్ద గూండా, హిట్లర్ వారసుడని, 20 ఏళ్ల వయసులో పెద్ద నేరం చేసి ఇంటి నుంచి పారిపోయి వచ్చాడని వర్మ ఆరోపించారు. -
నరేంద్ర మోడీ ఓ జంతువు
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీపై అనుచిత వ్యాఖ్యల విషయంలో కేంద్ర మంత్రి బేణీప్రసాద్‌వర్మ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎన్నికల సంఘం షోకాజు నోటీసు జారీ చేసిన మర్నాడే ఆయన మరోసారి మోడీపై దూషణకు దిగారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో కాంగ్రెస్ కార్యకర్తల ర్యాలీలో మాట్లాడుతూ... నరేంద్రమోడీ ఓ జంతువు అని, ఆయన గుణపాఠం నేర్వాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతకుముందు మోడీపై వర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నాయని భావించిన ఈసీ గురువారం ఆయనకు షోకాజు నోటీసు జారీ చేసింది. మోడీ ఓ పెద్ద గూండా, హిట్లర్ వారసుడని, 20 ఏళ్ల వయసులో పెద్ద నేరం చేసి ఇంటి నుంచి పారిపోయి వచ్చాడని వర్మ ఆరోపించారు. రాహుల్ ప్రధాని అయితే మోడీ, ఆయన అనుచరుడు అమిత్‌షా జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుందంటూ వ్యాఖ్యలు చేయడంతో ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఆయనకు షోకాజు నోటీసులు జారీ అయ్యాయి. అయినా, ఆయన తన అనుచిత వ్యాఖ్యలను కొనసాగించడం గమనార్హం. -
'18 ఏళ్లలోనే మోడి హత్య చేసి...పారిపోయారు'
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బేణి ప్రసాద్ వర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. మోడీ 18 ఏళ్ల వయస్సులో హత్య చేసి ఇంటి నుంచి పారిపోయాడని వర్మ ఆరోపించారు. లక్నోలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బేణి మాట్లాడుతూ.. గుజరాత్ లోని పోలీస్ స్టేషన్లలో పలు క్రిమినల్ కేసులు మోడీపై నమోదయ్యాయి అని అన్నారు. బేణి వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా దిగజారుతుందని బేణి వ్యాఖ్యలతో మరోసారి నిరూపించారని ఆమె అన్నారు. పలు ఎన్నికల్లో బేణి అక్రమాలకు పాల్పడ్డారని సీతారామన్ ఆరోపించారు. బేణి వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందా అని సీతారామన్ ప్రశ్నించారు. -
చివరి విడత నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లోని 41 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 12న చివరి విడతగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. ఈ ఆఖరి విడతలో ఉత్తరప్రదేశ్‌లో 18 స్థానాలకు, పశ్చిమబెంగాల్లో 17 సీట్లకు, బీహార్‌లో ఆరు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో బరిలో ఉన్న అభ్యర్థులు ఈనెల 24 వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. వాటిని 25న పరిశీలిస్తారు. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఏప్రిల్ 28 చివరి తేదీ. కాగా, చివరి విడత ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. మోడీ పోటీలో నిలిచిన వారణాసికి ఈ విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ మోడీకి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ పోటీ చేస్తున్న యూపీలోని ఆజంగఢ్ కు కూడా ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది. నామినేషన్ల హోరు: చివరి రెండు విడతల ఎన్నికలకు సంబంధించి బరిలో ఉన్న అభ్యర్థులు గురువారం తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గోండా నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కేంద్ర మంత్రి బేణిప్రసాద్ వర్మతోపాటు వారణాసి నుంచి కాంగ్రెస్ తరఫున అజయ్‌రాయ్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రులు బీసీ ఖండూరి, రమేష్ పోఖ్రియాల్‌లు నామినేషన్లు దాఖలుచేసినవారిలో ఉన్నారు. అలహాబాద్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి మనవడు ఆదర్ష్ శాస్త్రి నామినేషన్ దాఖలు చేశారు. -
నరేంద్రమోడీని ఈసీ నిషేధించాలి: బేణి
లక్నో: ప్రత్యర్థి రాజకీయ నేతలపై ఎడాపెడా విమర్శలు చేసే కేంద్ర మంత్రి బేణి ప్రసాద్ వర్మ తాజాగా నరేంద్రమోడీ, అమిత్ షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు మతం రంగు అద్దుతున్న నరేంద్రమోడీ, అమిత్ షాలను ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించాలని బేణి డిమాండ్ చేశారు. మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటున్న బీజేపీ, సమాజ్ వాదీ పార్టీలను నిషేధించాలని ఎన్నికల సంఘానికి ఆయన విజ్క్షప్తి చేశారు. అనేక అరోపణలు ఎదుర్కొంటున్న అమితా షాపై అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయని.. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న విషయాన్ని బేణి మీడియా దృష్టికి తీసుకువచ్చారు. -
బేణీ.. ములాయం.. భాయీ భాయీ!!
కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మను ఎప్పుడు ఎవరు కదిలించినా ముందుగా ఆయన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌పై మండిపడుతుంటారు. వాళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ, సోమవారం ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. పార్లమెంటులో ములాయం ఎదురైనప్పుడు బేణీ ప్రసాద్ వర్మ ఆయనను పలకరించారు. సభ ప్రారంభం కావడానికి ముందే ఈ చిత్రం కనిపించింది. తన పార్టీ సభ్యులు చుట్టూ ఉన్న కూడా, ములాయం కూడా తన పాత మిత్రుడు బేణీకి ప్రతి నమస్కారం చేశారు. అంతే కాదు.. చెయ్యి పట్టుకుని ఆపేందుకు కూడా ప్రయత్నించారు. కానీ బేణీ మాత్రం నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో ములాయం సింగ్ యాదవ్ తన పక్కన ఉన్నవారితో 'దేఖో భాగ్ గయా (చూడండి, పారిపోయాడు)' అంటూ చమత్కరించారు. ములాయంతో పాటు ఆయన కుమారుడు, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్‌పై కూడా బేణీ ప్రసాద్ వర్మ తరచు విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు సోషలిస్టులుగా, సన్నిహిత మిత్రులుగా ఉన్న బేణీ, ములాయం కలిసే సమాజ్‌వాదీ పార్టీని 20 ఏళ్ల క్రితం స్థాపించారు. పార్టీలోకి అమర్‌సింగ్ ప్రవేశం తర్వాత నుంచి అక్కడ బేణీ ప్రభ తగ్గిపోయింది. చివరకు 2009లో బేణీ కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయి లోక్‌సభకు ఎన్నికై కేంద్ర మంత్రివర్గంలో చేరారు. -
నరేంద్రమోడీ ఓ హిట్లర్: బేణి ప్రసాద్ వర్మ
లక్నో: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కేంద్రమంత్రి బేణి ప్రసాద్ వర్మ మరోసారి వార్తలకెక్కారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని హిట్లర్‌తో, ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్‌ను ముస్సోలినితో పోల్చారు. ఓట్లను కొల్లగొట్టేందుకు వీరిద్దరి రహస్య అజెండాతో ముందుకువెళ్తున్నారని విమర్శించారు. ‘‘భారత రాజకీయాల్లో హిట్లర్ పుట్టాడు. అలాగే ఉత్తరప్రదేశ్‌లో ముస్సోలిని జన్మించాడు. వారిద్దరూ ఇప్పుడు మోడీ, ములాయం రూపంలో మళ్లీ పునర్జన్మ ఎత్తారు. ఈ హిట్లర్, ముస్సోలిని వల్లే ఇటీవల ముజఫర్‌నగర్‌లో అల్లర్లు జరిగాయి’’ అని వ్యాఖ్యానించారు. ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లో మోడీ నియంతలా మారారని, ఆయన ముందు ముస్లింలు నోరెత్తే సాహసం చేయలేరని పేర్కొన్నారు. ‘‘ఆ హిట్లర్‌కు భయపడి చివరికి ఆరెస్సెస్, బీజేపీలో కూడా ఎవరూ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేరు. మోడీని 2014 ఎన్నికల ప్రచార సారథిగా ప్రకటించిన గోవా సభలకు వెళ్లని అద్వానీ.. ఈ రోజు ఆయన చేపట్టే ‘ఐక్యతా పరుగు’ను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ జపం చేస్తున్న మోడీ... గాంధీని మాత్రం పక్కనపెడుతున్నారు. సర్దార్‌ను హోంమంత్రిగా చేసింది గాంధీయే అన్న సంగతి గుర్తుంచుకోవాలి’’ అని బేణి అన్నారు. కాగా, బేణి వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆయనను సొంత పార్టీయే సీరియస్‌గా తీసుకోదని ఎద్దేవా చేసింది. ముందుగా మోడీ స్థాయి, అయన ప్రజాదరణ గురించి తెలుసుకొని మాట్లాడితే మంచిదని బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ అన్నారు. -
`రాహుల్ గాంధీయే కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్ధి`
న్యూఢిల్లీ: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీయే కాంగ్రెస్ ప్రధాన మంత్రి అభ్యర్థి అని కేంద్రమంత్రి బేణీ ప్రసాద్ వర్మ వ్యాఖ్యానించారు. గురువారం ఇక్కడ న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ... రాహుల్ గాంధీయే దేశానికి కాబోయే ప్రధానమంత్రి అని, ఆయన తరువాత మరో నాయకుడు లేడని చెప్పారు. అంతకముందు నందన్ నీలేకని పేరు ప్రధాని అభ్యర్ధిగా వినిపించిన నేపథ్యంలో కాంగ్రెస్ బుధవారం తిరస్కరించి ఊహాత్మక చర్చగా పరిగణించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్ధిత్వం విషయంలో రాహుల్ గాంధీ పేరునే సోనియా గాంధీ పరిశీలనలో ఉంచినట్టు ఆదివారం ఊహాగానాలు వినిపించాయి. సెప్టెంబర్ లో నందన్ నీలేకని కాంగ్రెస్ లో చేరుతున్నారని, ఆయన 2014లో బెంగళూరు నుంచి లోకసభ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు కథనాలు వినిపించాయి. అయితే ఇదంతా కాంగ్రెస్ నడిపించిన లీకుల రాజకీయంలో భాగమేనని కూడా విమర్శలు వచ్చాయి. తాజాగా బేణీ ప్రసాద్ వర్మ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీని కాంగ్రెస్ ప్రమోట్ చేస్తోందన్న విషయం మరోసారి నిరూపితమైంది.