నరేంద్ర మోడీ ఓ జంతువు
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీపై అనుచిత వ్యాఖ్యల విషయంలో కేంద్ర మంత్రి బేణీప్రసాద్‌వర్మ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎన్నికల సంఘం షోకాజు నోటీసు జారీ చేసిన మర్నాడే ఆయన మరోసారి మోడీపై దూషణకు దిగారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో కాంగ్రెస్ కార్యకర్తల ర్యాలీలో మాట్లాడుతూ... నరేంద్రమోడీ ఓ జంతువు అని, ఆయన గుణపాఠం నేర్వాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతకుముందు మోడీపై వర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నాయని భావించిన ఈసీ గురువారం ఆయనకు షోకాజు నోటీసు జారీ చేసింది. మోడీ ఓ పెద్ద గూండా, హిట్లర్ వారసుడని, 20 ఏళ్ల వయసులో పెద్ద నేరం చేసి ఇంటి నుంచి పారిపోయి వచ్చాడని వర్మ ఆరోపించారు.
రాహుల్ ప్రధాని అయితే మోడీ, ఆయన అనుచరుడు అమిత్‌షా జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుందంటూ వ్యాఖ్యలు చేయడంతో ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఆయనకు షోకాజు నోటీసులు జారీ అయ్యాయి. అయినా, ఆయన తన అనుచిత వ్యాఖ్యలను కొనసాగించడం గమనార్హం.