'18 ఏళ్లలోనే మోడి హత్య చేసి...పారిపోయారు'
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బేణి ప్రసాద్ వర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. మోడీ 18 ఏళ్ల వయస్సులో హత్య చేసి ఇంటి నుంచి పారిపోయాడని వర్మ ఆరోపించారు. లక్నోలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బేణి మాట్లాడుతూ.. గుజరాత్ లోని పోలీస్ స్టేషన్లలో పలు క్రిమినల్ కేసులు మోడీపై నమోదయ్యాయి అని అన్నారు.
బేణి వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా దిగజారుతుందని బేణి వ్యాఖ్యలతో మరోసారి నిరూపించారని ఆమె అన్నారు. పలు ఎన్నికల్లో బేణి అక్రమాలకు పాల్పడ్డారని సీతారామన్ ఆరోపించారు. బేణి వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందా అని సీతారామన్ ప్రశ్నించారు.