అగ్రి బిజినెస్‌కు ప్రోత్సాహం | Encouragement to the Agri Business | Sakshi
Sakshi News home page

అగ్రి బిజినెస్‌కు ప్రోత్సాహం

Published Thu, Nov 2 2017 2:11 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

Encouragement to the Agri Business - Sakshi

న్యూఢిల్లీ:వ్యవసాయాన్ని లాభదాయకం చేసేలా రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన(ఆర్‌కేవీవై)పథకంలో పలు మార్పులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ పథకంలో భాగంగా పంట కోత అనంతరం అవసరమయ్యే వసతుల కల్పన, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధి తదితరాలపై దృష్టిపెట్టాలని నిర్ణయించింది. ఆర్‌కేవీవై– రఫ్తార్‌(వ్యవసాయం, అనుబంధ రంగాల పునరుత్తేజానికి లాభసాటి విధానాలు)గా పేరు మార్చిన ఈ పథకాన్ని రూ.15,722 కోట్ల బడ్జెట్‌తో మూడేళ్ల పాటు అమలుచేస్తారు. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.  

- ఆర్‌కేవీవై–రఫ్తార్‌ పథకానికి నిధులను కేంద్రం, రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో సమకూరుస్తాయి.
- ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల్లో  మాత్రం నిధులు 90:10 నిష్పత్తిలో అందుతాయి.
- వార్షిక వ్యయంలో 50 శాతం నిధులను వ్యవసాయ మౌలిక వసతులు, ఆస్తుల కల్పనకు కేటాయిస్తారు.
- 30 శాతం నిధులను వాల్యూ అడిషన్‌ అనుసంధానిత ఉత్పత్తి ప్రాజెక్టులకు, 20 శాతం నిధులను స్థానిక అవసరాలకు అనుగుణంగా ఫ్లెక్సీ నిధులుగా వెచ్చిస్తారు.   

కేబినెట్‌ మరికొన్ని నిర్ణయాలు:  జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ)అనుమతి లేకుండా ఉపాధ్యాయ శిక్షణ ఇస్తున్న కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు గుర్తింపునిచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. ఈ బిల్లు వల్ల ఎన్‌సీటీఈ–1993 చట్టానికి సవరణ చేయడం ద్వారా గుర్తింపు లేని ఆయా సంస్థల్లో చదువుతున్న, చదివిన విద్యార్థులను ఉపాధ్యాయ వృత్తికి అర్హులుగా పరిగణిస్తారు. ఒకేసారి ఇచ్చే ఈ మినహాయింపు పాతకాలం నుంచి(రెట్రోస్పెక్టివ్‌) అమల్లోకి వస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement