న్యూఢిల్లీ: ఆడ పిల్లలకు మగ పిల్లలతో సమానంగా హక్కులుంటాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఆడ భ్రూణహత్యల నివారణకు దేశ వ్యాప్తంగా కొత్తగా పుట్టిన వారి డేటాబేస్‌ను నిర్వహించాలని ఆదేశించింది. భ్రూణ హత్యలు మన విలువల పతనానికి దారితీస్తున్నాయని, లింగ నిష్పత్తిని తగ్గిస్తున్నాయని పేర్కొంది. ఇది ఇలాగే కొనసాగితే ఊహించలేని విపత్తు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. బాలికలకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి రాజీ ఉండరాదని ఉద్ఘాటిస్తూ...పెత్తనం, అహంకారం లాంటి ప్రశ్నలకు తావుండరాదని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ తీర్పు ప్రకటించింది.