
‘ఆయన శత్రువు కూడా ఈ మాటలు నమ్మరు’
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మొన్న ఆయనపై ధిక్కార స్వరం వినిపించి అవసరం అయితే పార్టీని సైతం వీడిపోతానంటూ వ్యాఖ్యానించిన కుమార్ విశ్వాస్ అండగా నిలిచారు. కపిల్ మిశ్రా చేసిన ఆరోపణలు అర్థరహితం అని ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత అయిన విశ్వాస్ అన్నారు. కేజ్రీవాల్ శత్రువు కూడా కపిల్ చేసిన ఆరోపణలు నమ్మబోరంటూ వ్యాఖ్యానించారు.
‘నేను కేజ్రీవాల్‌తో పనిచేశాను. ఆయన అవినీతికి పాల్పడతారనే విషయాన్నిగానీ, ఒకరి నుంచి లంచం తీసుకుంటారనే విషయాన్నిగానీ నేను అస్సలు ఊహించుకోలేకపోతున్నాను. కావాలనే కేజ్రీవాల్‌పై బురద జల్లుతున్నారు. పార్టీలో ఏ నేత అవినీతికి పాల్పడినా వారిని వెంటనే తొలగిస్తానంటూ చెప్పిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అలాంటి వ్యక్తి అవినీతికి పాల్పడ్డారంటూ చేసిన ఆరోపణలు బాధ్యతారహితమైనవి, నిర్లక్ష్యంతో ఉద్దేశ పూర్వకంగా చేసినవి. కేజ్రీవాల్ శత్రువు కూడా ఈ ఆరోపణలు నమ్మలేరు’ అని కుమార్ విశ్వాస్ చెప్పారు.