న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై బీజేపీ నేత కపిల్ మిశ్రాలు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. కేజ్రీవాల్ ప్రభుత్వం కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్యను కావాలనే తక్కువ చేసి చూపెడుతోందంటూ ఆయన ఫైర్ అయ్యారు. కాగా ఢిల్లీలో ఇప్పటిదాకా 6,542 కేసులు నమోదు కాగా, 73 మంది మరణించినట్లు ప్రభుత్వం లెక్కలు చూపింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. కోవిడ్-19 బాధితుల అంత్యక్రియలు నిగంబోడ్ ఘాట్, పంజాబీ బాగ్, ఐటీఓ విద్యుత్ దహన వాటికలలో జరుగుతున్నాయి. చదవండి: కోవిడ్: 75శాతం కేసులు అలాంటివే..!
ఏప్రిల్ 3 నుంచి నిగంబోడ్ ఘాట్‌లో దహనం చేసిన మృతదేహాల సంఖ్య 155 కన్నా ఎక్కువ, పంజాబీ బాగ్‌లో 72, ఐటిఓ శ్మశానవాటికలో 95 మృతదేహాలను ఖననం చేసినప్పటికీ.. మే 10 నాటికి రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 73 మంది మాత్రమే చనిపోయారని తప్పు లెక్కలు చూపెడుతోంది. ఈ సందర్భంగా ఆయన విద్యుత్ దహన వాటికల వద్ద ఒక్కో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఎన్ని గంటల సమయం పడుతుందో గణాంకాలతో సహా వివరించారు. అయితే కపిల్ మిశ్రా విమర్శలపై కేజ్రీవాల్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం గమనార్హం. చదవండి: 2లక్షలు దాటిన కరోనా కేసులు
Comments
Please login to add a commentAdd a comment