
సాక్షి, రాంచీ : జార్ఖండ్‌లోని బాణాసంచా కర్మాగారంలో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8మంది మృతి చెందగా.. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం కుమారడుబిలోని బాణాసంచా కర్మాగారంలో తీవ్రమైన పేలుడు సంభవించింది. వెంటనే మంటలు వ్యాపించడం.. పరిస్థితి అదుపుతప్పింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న 5మంది కార్మికులు అక్కడికక్కడే చనిపోగా.. మరో ముగ్గురు తీవ్రగాగాయలతో ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ ఘటనలో మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కార్మికలు, ఇతరులు ఉన్నారు. లొపల బాణాసంచా భారీగా ఉండడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. మంటలు అదుపులోకి తీసుకువచ్చేందుకు అగ్నిమాక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.