అమ్మో... అమ్మాయిల్ని ఆ స్కూలుకు పంపం!
అత్యాచార ఘటన నేపథ్యంలో తల్లిదండ్రుల నిర్ణయం
రేవారి: హరియాణాలో ఓ గ్రామంలోని పాఠశాలలో బాలికపై అత్యాచారం జరగడంతో మిగతా అమ్మాయిల తల్లిదండ్రులు వారిని స్కూల్‌కు పంపేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో రేవారికి చెందిన 38 మంది బాలికలు బడికి రావడంలేదు. గత నెల 18న లాలా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒక బాలికపై అత్యాచారం జరిగింది. దాంతో పొరుగున ఉన్న రేవారి గ్రామంలోని తల్లిదండ్రులు తమ అమ్మాయిలను లాలాలోని పాఠశాలకు పంపడం లేదు. 9 నుంచి 12వ తరగతి చదివే బాలికల పేర్లను రిజిష్టర్ నుంచి తొలిగించాలని తల్లిదండ్రులు అడిగారు. దీంతో మరో పొరుగు గ్రామం సుమాఖేరాలోని ప్రాథమిక పాఠశాల స్థాయిని పెంచాలని స్థానికులు ఆందోళన చేసి కమిషనర్ గార్గ్‌కు వినతి పత్రమిచ్చారు.
నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం...
బెంగళూరు: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన అధ్యాపకుడికి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బాలిక ఈ నెల 3న సమ్మర్ క్యాంపుకు వెళ్లింది. ఇంటికి తిరిగొచ్చాక కడుపు నొప్పిగా ఉందని చెప్పింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా అత్యాచారానికి గురైనట్లు తేలింది. తనను పీటర్ (21) అనే అధ్యాపకుడు లైంగికంగా వేధించాడని అమ్మాయి తెలపడంతో అతణ్ని అరెస్ట్ చేశారు.