న్యూఢిల్లీ: 2012-13 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీల ఆదాయం రూ. 991.20 కోట్లుగా తేలింది. అత్యధిక ఆదాయం గడించిన పార్టీల్లో కాంగ్రెస్ అగ్రస్థానంలో నిలవగా, బీజేపీ రెండు, సీపీఎం మూడో స్థానం దక్కించుకున్నాయి. 2012-13లో కాంగ్రెస్‌కు రూ. 425.69 కోట్ల ఆదాయం సమకూరగా, బీజేపీకి రూ. 324.16 కోట్లు ఆదాయం లభించింది. సీపీఎంకు రూ. 126.09 కోట్లు, బీఎస్పీకి రూ. 87.63 కోట్లు, ఎన్సీపీ రూ. 26.56 కోట్లు, సీపీఐకి రూ. 1.07 కోట్లు ఆదాయం లభించింది. 2012-13లో రాజకీయ పార్టీల ఆదాయవ్యయాలపై అధ్యయనం చేసిన స్వచ్ఛంద సంస్థలు నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) బుధవారం నివేదికను వెల్లడించాయి. ఆరు జాతీయ పార్టీలు సమర్పించిన ఐటీ రిటర్న్‌ల ఆధారంగా ఈ నివేదికను రూపొందించాయి. ళీ జాతీయ పార్టీలకు కార్పొరేట్లు, వ్యాపార వర్గాల నుంచి 72 శాతం, వ్యక్తిగత దాతల నుంచి 17 శాతం విరాళాలు అందాయి. 11 శాతం చందాలకు సంబంధించి దాతల వివరాలు లేవు. ళీ 703 మంది దాతల నుంచి అందిన రూ. 11.14 కోట్లకు సంబంధించిన విరాళాల వివరాలు లేవు. ళీ రూ. 20 వేలకు మించి చందాలు ఇచ్చిన దాతల సంఖ్య 3,777.
పార్టీల ఆదాయం 991 కోట్లు
Published Thu, Jun 26 2014 2:16 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement