చెన్నై: చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ బోగీలో స్వల్పంగా మంటలు రేగాయి. ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. చెన్నై సెంట్రల్ స్టేషన్ నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటలకు బయలు దేరిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్ చెన్నైకి 45 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. రాత్రి 7.10 గంటలకు గుమ్మిడిపూండి- ఎలావూరు మధ్య వెళుతుండగా ఏ1 ఏసీ బోగీలో ముందుగా పొగలు వ్యాపించి తర్వాత మంటలు రేగాయి. ప్రయాణికులు కేకలు పెడుతూ చైన్‌లాగడంతో రైలు ఆగింది. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. ప్రయాణికులను ఏ2 బోగీలోకి మార్చారు. రైలును గుమ్మిడిపూండి వరకు వెనక్కు నడిపి మంటలు రేగిన బోగీని తనిఖీ చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు రేగినట్లు గుర్తించారు. రాత్రి 9.15 గంటలకు రైలును హైదరాబాద్ పంపారు.
చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
Published Wed, Jul 16 2014 1:53 AM | Last Updated on Tue, Oct 2 2018 8:10 PM
Advertisement