Charminar Express
-
ఉదయం నాంపల్లిలో ప్రమాదం.. సాయంత్రానికి మళ్లీ చార్మినార్ కూత
-
పట్టాలు తప్పిన రైలు..ప్రమాదం ఎక్కడ జరిగింది..?
-
నాంపల్లి: చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం ప్రమాదానికి గురైన చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు పునరుద్ధరించారు. పునరుద్ధరణ పనుల నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్లకు మినహాయించి.. ఇతర ఏ సర్వీసులకు ఇబ్బంది కలగలేదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాద రైలు కోచ్ లని టెస్టింగ్ కోసం షెడ్డుకు తరలించినట్లు తెలిపారు. చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు ఈ ఉదయం ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు చేరుకునే క్రమంలో.. పట్టాలు తప్పి ఫ్లాట్‌ఫామ్ సైడ్వాల్ను ఢీకొట్టింది. రైలు స్లోగా ఉండడంతోనే పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మొత్తం మూడు బోగీలు పట్టాలు తప్పగా, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో రైలు డెడ్ ఎండ్‌కు వచ్చిన తర్వాతే ప్రమాదం జరిగిందని సీపీఆర్వో రాకేష్ తెలిపారు. డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతోనే రైలు పట్టాలు తప్పిందన్నారు. ఇక దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ధనంజయులు నేతృత్వంలోని రైల్వే అధికారుల బృందం సహాయ, పునరుద్ధరణ చర్యలను చేపట్టింది. సౌత్ సెంట్రల్ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ సంఘటనపై చట్టబద్దమైన విచారణను నిర్వహిస్తుందని తెలిపారు. ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు నాంపల్లి రైల్వేస్టేషన్లో సహాయక చర్యల దృష్ట్యా పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు నాంపల్లి-మేడ్చల్, మేడ్చల్-హైదరాబాద్, హైదరాబాద్ లింగంపల్లి ఎంఎంటీఎస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. అయితే నాంపల్లి రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫారమ్ 1,2 వైపు నుంచి రైళ్ల రాకపోకలు సాగాయి. ఈ రోజు షెడ్యూల్లో ఉన్న ప్యాసింజర్ రైళ్లను నడిపారు. ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. పట్టాలు కొద్దిగా పక్కకి ఒరగడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టాలని, గాయపడిన ప్రయాణికులకు సరైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు ఇదీ చదవండి: సంక్రాంతికి మరో ఆరు ప్రత్యేక రైళ్లు -
చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ
ఉలవపాడు: అర్ధరాత్రి వేళ.. అందరూ నిద్రలో ఉన్నారు.. అంతలో ఒక్కసారిగా రైల్లో కలకలం.. బోగీలోకి ఎక్కిన దొంగలు ప్రయాణికులను బెదిరించి వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు తీసుకుని చైన్ లాగి దర్జాగా రైలు దిగి వెళ్లిపోయారు. చాగల్లు–తెట్టు మధ్య హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి చెన్నైకు వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రాత్రి గం.1.50 సమయంలో నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం రాజుపాలెం (చాగల్లు–తెట్టు) వద్ద దొంగలు చైన్ లాగడంతో రైలు నిలిచింది. దొంగలు ప్రయాణికులను బెదిరించి వారి నుంచి నగలు అపహరించి రైలు దిగారు. అనంతరం హైదరాబాద్ నుంచి తాంబరం వెళుతున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్ 2.30గం.ల. సమయంలో సిగ్నల్ వద్ద నిలిచిపోయింది. అక్కడే ఉన్న దొంగలు అక్కడే ఉండి ప్రయాణికులను బెదిరించి దోపిడీ చేసేందుకు యతి్నంచారు. కానీ రైల్వే పోలీసులు టార్చ్లైట్లు వేసి వారిని చూడాలని ప్రయత్నించడంతో రైలుపై రాళ్లు రువ్వారు. దీంతో ఆటోలో దొంగలు పారిపోయారు. ఈ రెండు ఘటనలు 40 నిమిషాల వ్యవధిలో జరిగాయి. నలుగురు దొంగలు! హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం మూడు బోగీలలో కలిపి 111 గ్రాముల బంగారం దోపిడీ జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి చెన్నైకు వెళ్తున్న మహేంద్రచౌదరి నుంచి 36 గ్రా. చైన్, నరేంద్రరెడ్డి, దీప్తిల దగ్గర్నుంచి 40 గ్రా. బంగారం, సరళ, తమిళనాడుకు చెందినవారు వారి వద్ద నుంచి 20 గ్రా. బంగారం, ఉమాజానకి నుంచి 15 గ్రా. చైన్.. మొత్తం 111 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలు బెదిరించి తీసుకెళ్లినట్టు తెలిసింది. సూళ్లూరుపేట స్టేషన్లో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ దోపిడీ మొత్తం నలుగురు దొంగలున్నట్టు పోలీసులు చెప్పారు. దొంగలను పట్టుకునేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్లు నెల్లూరు జీఆర్పీ డీఎస్పీ మల్లికార్జునరావు తెలిపారు. ఆరుగురు ఎస్ఐలు, ఆరుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 12 మంది కానిస్టేబుళ్లతో ఈ బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎస్2 నుంచి ఎస్8 వరకు బోగీల్లో ప్రయాణికులను దొంగలు బెదిరించినట్లు తెలిపారు. అయితే ఆ బోగీల్లో పోలీస్ సిబ్బంది లేకపోవడం వల్లే భారీ దోపిడీ జరిగిందని ఆరోపణలున్నాయి. -
చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో ఘటన.. రైల్వే యాక్షన్..
సాక్షి, హైదరాబాద్ : రైలులో అమ్మే టీలో బాత్ రూం నీళ్లను కలిపిన వీడియోపై భారతీయ రైల్వే చర్యలకు ఉపక్రమించింది. బాత్రూం నీళ్లను టీ క్యాన్‌లో కలిపిన కాంట్రాక్టర్‌కు లక్ష రూపాయలు జరిమానా విధించింది. గతేడాది డిసెంబర్లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఉదంతం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. చెన్నై సెంట్రల్ నుంచి హైదరాబాద్ వస్తోన్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆగింది. ఇద్దరు టీ అమ్మే వ్యక్తులు మూడు టీ క్యాన్లు తీసుకొని రైలులోని ఓ బోగీలోకి ఎక్కారు. ఒక వ్యక్తి ఆ మూడు క్యాన్లను టాయిలెట్లోకి తీసుకెళ్లగా.. మరో వ్యక్తి బయట కాపలాగా నిలుచున్నాడు. టీ క్యాన్లలో నీళ్లు నింపుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సమయంలో బోగీ తలుపు వద్ద నిలుచున్న ఓ వ్యక్తి తన స్మార్ట్‌ఫోన్‌తో ఈ ఘటనను చిత్రీకరించారు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొద్ది రోజులుగా వైరల్‌గా మారిన ఈ వీడియోపై రైల్వే శాఖ ఎట్టకేలకు స్పందించింది. రంగంలోకి దిగిన దక్షిణ మధ్య రైల్వే విజిలెన్స్ అధికారులు వీడియోలోని టీ అమ్మే వ్యక్తులను గుర్తించారు. సికింద్రాబాద్-ఖాజీపేట జంక్షన్ల మధ్య రైళ్లలో ఆహార విక్రయ కాంట్రాక్టును సొంతం చేసుకున్న పి.శివప్రసాద్ అనే కాంట్రాక్టర్‌కి చెందిన ఉద్యోగులే ఇందుకు పాల్పడినట్లు అధికారుల విచారణలో తేలింది. దీంతో శివప్రసాద్‌కు దక్షిణ మధ్య రైల్వే లక్ష రూపాయల జరినామా విధించింది. శివప్రసాద్‌కు ఉన్న ఐఆర్సీటీసీ లైసెన్స్‌ను కూడా రద్దు చేసింది. -
చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
ఆరు బోగీల్లో మొత్తం 129 గ్రాముల బంగారు నగల అపహరణ ఒంగోలు: చెన్నై నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలులో(రైలు నం.12759) శనివారం రాత్రి కొంతమంది దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఒంగోలు రైల్వేస్టేషన్ దాటిన తర్వాత రాత్రి 11.30 గంటల అనంతరం రైలు ఆగేందుకు చైన్ లాగిన దుండగులు మొత్తం ఆరు బోగీల్లో కిటికీల పక్కన ఉన్న మహిళల మెడల్లో బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు. అమ్మనబ్రోలు, ఉప్పుగుండూరు రైల్వేస్టేషన్ల మధ్య రైలును ఆపి 10 నుంచి 12 మందితో కూడిన ముఠా ఈ దోపిడీకి పాల్పడ్డట్లు రైల్వే పోలీసుల విచారణలో వెల్లడైంది. రైలు సికింద్రాబాద్ చేరిన తర్వాత పలువురు మహిళలు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
చెన్నై: చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ బోగీలో స్వల్పంగా మంటలు రేగాయి. ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. చెన్నై సెంట్రల్ స్టేషన్ నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటలకు బయలు దేరిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్ చెన్నైకి 45 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. రాత్రి 7.10 గంటలకు గుమ్మిడిపూండి- ఎలావూరు మధ్య వెళుతుండగా ఏ1 ఏసీ బోగీలో ముందుగా పొగలు వ్యాపించి తర్వాత మంటలు రేగాయి. ప్రయాణికులు కేకలు పెడుతూ చైన్‌లాగడంతో రైలు ఆగింది. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. ప్రయాణికులను ఏ2 బోగీలోకి మార్చారు. రైలును గుమ్మిడిపూండి వరకు వెనక్కు నడిపి మంటలు రేగిన బోగీని తనిఖీ చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు రేగినట్లు గుర్తించారు. రాత్రి 9.15 గంటలకు రైలును హైదరాబాద్ పంపారు. -
చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు
చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టినట్లు బెదిరింపులు రావడంతో రైల్వే అధికారులు అప్రమత్తమైయ్యారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో ఆ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను నిలిపివేశారు. అనంతరం ప్రయాణికులను ట్రైన్ నుంచి దింపివేశారు. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాదాపు గంట నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సరైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.