బీహార్ రాజధాని పాట్నా బాంబు పేలుళ్లలో మరణించిన వారి సంఖ్య ఐదుకు పెరిగింది. మరో 50 మంది గాయపడ్డారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆదివారం పాల్గొన్న హూంకార్ ర్యాలీ ముందు పాట్నా వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. గాయపడిన వారిని పాట్నా మెడికల్ కాలేజీ, ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. తొలుత ఒకరు చనిపోయినట్టు వార్తలు రాగా ఆ సంఖ్య ఐదుకు చేరినట్టు అధికారులు ధ్రువీకరించారు.
పాట్నాలో ఆదివారం ఉదయం మొత్తం ఏడు పేలుళ్లు జరిగాయి. వేదిక గాంధీ మైదాన్ సమీపంలోనే ఆరు పేలుళ్లు సంభవించాయి. పోలీసులు వెంటనే అప్రమత్తమై మరో రెండు బాంబులను నిర్వీర్యం చేశారు. సహాయ కార్యక్రమాలను చేపట్టి భద్రతను పటిష్టం చేశారు. అనంతరం మోడీ ర్యాలీ ఎలాంటి ఆటంకం లేకుండా సాగింది.
పాట్నా పేలుళ్లలో ఐదుగురి మృతి, 50 మందికి గాయాలు
Published Sun, Oct 27 2013 3:30 PM | Last Updated on Thu, Apr 4 2019 5:24 PM
Advertisement