నైనిటాల్: తనకు తన భర్త బలవంతంగా ఆరుసార్లు గర్భస్రావం(అబార్షన్) చేయించాడని తలాక్ విధానాన్ని ప్రశ్నించి జాతీయ వార్తల్లో నిలిచిన షయార బానో ఆరోపించింది. తనకు ఎదురవుతున్న కష్టాలన్నింటి నుంచి విముక్తి పొందాలనుకుంటున్నానని చెప్పింది. ఇందుకోసం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని తెలిపింది. ఉద్ధంసింగ్ నగర్ జిల్లా కాషిపూర్ చెందిన షయార సోషియాలజీలో గ్రాడ్యుయేట్. ఆమెకు ఇద్దరు పిల్లలు.
అనూహ్యంగా గత అక్టోబర్లో తన భర్త రిజ్వాన్ అహ్మద్ ఆమెకు తలాక్ చెప్పడంతో సుప్రీంకోర్టుకు ఆశ్రయించారు. తలాక్ విధానాన్ని ఆమె ప్రశ్నించారు. ముస్లిం మహిళల హక్కులు కాపాడాల్సిన అవసరం ఉందని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతానికి ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. అందుకే తనకు న్యాయం కావాలని, తన బతుకు తాను బతికేయాలనుకుంటున్నానని చెప్పింది.
అప్పటికే ఇద్దరు బిడ్డల తల్లినైన తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా పిల్స్ వేయడం ఇతర చర్యల ద్వారా ఆరు సార్లు గర్భస్రావం చేయించాడని ఫలితంగా తన ఆరోగ్యం చెడిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఇద్దరు పిల్లలు కూడా ప్రస్తుత భర్త రిజ్వాన్ దగ్గరే ఉంటున్నారు.
'బలవంతంగా ఆరుసార్లు అబార్షన్ చేయించారు'
Published Tue, Apr 19 2016 5:20 PM | Last Updated on Tue, Nov 6 2018 4:37 PM
Advertisement