
రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగిని అరెస్ట్ చేశారు. తాను ఎస్టీనని పేర్కొంటూ తప్పుడు అధికారిక పత్రాలను ప్రకటించినందుకు ఆయన అరెస్ట్ అయ్యారు.2013లో చత్తీస్‌గఢ్‌లోని మార్వాహి అసెంబ్లీ స్ధానం నుంచి తనపై పోటీచేసిన బీజేపీ నేత సమీర పైక్రా ఫిర్యాదుపై అమిత్ జోగి అరెస్ట్ అయ్యారు. మార్వాహి రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి తప్పుడు పత్రాలతో ఎస్టీగా పేర్కొంటూ అమిత్ జోగి పోటీ చేశారని ఆయన ప్రత్యర్ధి ఫిర్యాదు చేశారు. కాగా, అమిత్ జోగిని బిలాస్‌పూర్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. పుట్టిన ప్రదేశం గురించి కూడా ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుగా పేర్కొన్నారనే ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment