ఎన్సీపీ మాజీ మంత్రి విజయ్‌కుమార్ గావిత్ బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు.
ముంబై: ఎన్సీపీ మాజీ మంత్రి విజయ్‌కుమార్ గావిత్ బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏక్‌నాథ్ ఖడ్సే గావిత్‌కు స్వాగతం పలికారు. కాగా విజయ్‌కుమార్ వైద్య విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనతోపాటు ఆయన కుటుంబసభ్యులు ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్నార నే ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయమై గావిత్ మాట్లాడుతూ కోర్టులో లేదా సిట్‌తో దర్యాప్తు జరిపించి ఆరోపణలు రుజువు చేయాలని, అలా చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని పేర్కొన్నారు. అనంతరం బీజేపీ నాయకుడు ఏక్‌నాథ్ ఖడ్సే మాట్లాడుతూ గావిత్‌పై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయన్నారు.