బెంగళూర్ : కోవిడ్-19 నుంచి ఆరోగ్య సిబ్బందిని కాపాడటంతో పాటు స్క్రీనింగ్ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు మిత్ర రోబోట్ సేవలను ప్రారంభించామని ఫోర్టిస్ హాస్పిటల్ శుక్రవారం వెల్లడించింది. ఆస్పత్రిలో ప్రవేశించే వైద్యులు, నర్సులు, వైద్య, వైద్యేతర సిబ్బందితో పాటు విజిటర్లను స్ర్కీనింగ్ చేసేందుకు రోబో సేవలను వినియోగిస్తామని ఫోర్టిస్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఫేషియల్, స్పీచ్ రికగ్నేషన్ ద్వారా విజిటర్‌కు కోవిడ్-19 లక్షణాలు ఉన్నాయా లేదా అనేది రోబోట్ పసిగడుతుంది.
ఈ ప్రక్రియ ద్వారా ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు కరోనా వైరస్ బారిన పడకుండా దూరం పాటించవచ్చని ఫోర్టిస్ హాస్పిటల్ తెలిపింది. రెండు దశల్లో రోబోటిక్ స్ర్కీనింగ్ జరుగుతుందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా హెల్త్‌కేర్ సిబ్బంది మహమ్మారి బారినపడుతున్న క్రమంలో తాము కోవిడ్-19 రోబోటిక్ స్ర్కీనింగ్‌ను ప్రవేశపెట్టామని ఫోర్టిస్ హాస్పిటల్స్ జోనల్ డైరెక్టర్ డాక్టర్ మనీష్ మాటూ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment