కోల్‌కతాలోని ఓ పెట్రోల్ బంక్‌లో ధరలను రాస్తున్న సిబ్బంది
న్యూఢిల్లీ: రూపాయి మారకపు విలువ పడిపోవడంతో డీజిల్, పెట్రోల్ ధరలు మరోమారు పెరిగాయి. సోమవారం డీజిల్ ధర లీటరుకు 14 పైసలు, పెట్రోల్ లీటరుకు 13 పైసలు పెరిగినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. దీంతో ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.69.46 రికార్డు స్థాయి గరిష్టానికి చేరుకుంది. ముంబైలో డీజిల్ ధర రూ.73.74కు చేరింది. ఆగస్టు 16న రూపాయి విలువ పడిపోయినప్పటి నుంచి ఇంధనం ధరలు పెరుగుతున్నాయి. గత నాలుగేళ్లలో పెట్రో ఉత్పత్తులపై పన్నుల ద్వారా కేంద్రానికి వస్తున్న సొమ్ము రూ.99,184 కోట్ల నుంచి రూ.2,29,019 కోట్లకు పెరిగింది. రాష్ట్రాల్లో వ్యాట్ రూ.1,37,157 కోట్ల నుంచి రూ.1,84,091 కోట్లకు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment