పాకిస్థాన్ గజల్ గాయకుడు గులాం అలీ, ఆయన తనయుడు జనవరి 12న కోల్ కతాలో కచేరీ చేయనున్నారు.
కోల్ కతా: పాకిస్థాన్ కు చెందిన ప్రఖ్యాత గజల్ గాయకుడు గులాం అలీ, ఆయన తనయుడు జనవరి 12న కోల్ కతాలో కచేరీ చేయనున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఒబ్రీన్ ఈ మేరకు మంగళవారం ప్రకటన చేశారు. 'గులాం అలీ, ఆయన తనయుడు జనవరి 12న కోల్ కతాలోని సర్కస్ మైదాన్ లో కచేరీ చేయనున్నార'ని డెరెక్ ఒబ్రీన్ ట్వీట్ చేశారు.
గతేడాది అక్టోబర్ లో ముంబైలో కచేరీ చేయనివ్వకుండా గులాం అలీని శివసేన అడ్డుకుంది. దీంతో కోల్ కతాలో కచేరీ చేయడానికి గులాం అలీని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆహ్వానించారు.