సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిపై రగిలిపోతున్న భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి పాకిస్తాన్‌కు వెళ్లే నదీ జలాలను నిలిపివేయాలని గురువారం నిర్ణయించింది. తూర్పు నదుల నుంచి పాక్‌కు వెళుతున్న జలాలను జమ్మూ కశ్మీర్, పంజాబ్‌లకు మళ్లించాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు.
రావి నదిపై షాపూర్-కంది వద్ద జలాశయం పనులు ప్రారంభయ్యాయని, యూజేహెచ్ ప్రాజెక్టులో నిల్వ చేసే మన జలాలను జమ్మూ కశ్మీర్ కోసం వాడతామని మిగిలిన జలాలను రెండవ రావి-బీఈఏస్ అనుసంధానం ద్వారా ఇతర పరీవాహక రాష్ట్రాలకు సరఫరా చేస్తామని గడ్కరీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులన్నింటినీ ఇప్పటికే జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించామని వరుస ట్వీట్లలో గడ్కరీ వెల్లడించారు. ఉగ్రవాదుల దుశ్చర్యలకు ఊతమిస్తున్న పాకిస్తాన్‌కు నదీ జలాల్లో మన వాటాను నిలిపివేయడం ద్వారా గట్టి గుణపాఠం చెప్పినట్టవుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment