ఎస్సీ విద్యార్థులకిచ్చే ఉపకార వేతనాల్లో పారదర్శకత కోసం కేంద్రం నిబంధనలు మార్చనుంది.
న్యూఢిల్లీ: ఎస్సీ విద్యార్థులకిచ్చే ఉపకార వేతనాల్లో పారదర్శకత కోసం కేంద్రం నిబంధనలు మార్చనుంది. విద్యార్థి పదోతరగతి హాల్‌టికెట్ నంబర్, పుట్టినతేదీ, ఆధార్ నంబర్‌ను దరఖాస్తులో పొందుపరిచేలా నిబంధనలు మార్చనున్నారు.
బ్యాంకు అకౌంట్లను ఆధార్‌తో అనుసంధానం చేస్తామని, ఆగస్టు 31 లోపే దరఖాస్తు చేసుకునేలా మార్పు చేయనున్నట్లు సాంఘిక న్యాయం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.