'మీరు ఊహించని ప్రాంతాలకు పాస్‌పోర్టు సెంటర్'
'మీరు ఊహించని ప్రాంతాలకు పాస్‌పోర్టు సెంటర్'
Published Sat, Jul 15 2017 4:53 PM | Last Updated on Tue, Sep 5 2017 4:06 PM
కోల్‌కత్తా : పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకోడానికి సామాన్యుడికి భారం కాకూడదని ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పాస్‌పోర్టు సెంటర్‌ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ విజన్ కోసం ప్రభుత్వం ఎంతో కృతనిశ్చయంతో పనిచేస్తుందని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఎంజే అక్బర్ చెప్పారు. ''పాస్‌పోర్టు అనేది హక్కు. ఇది బహుమతి కాదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం'' అని ఉత్తర కోల్‌కత్తాలో బీడాన్ స్ట్రీట్ పోస్టు ఆఫీసులో పోస్టు ఆఫీసు పాస్‌పోర్టు సేవాకేంద్రా(పీఓపీఎస్‌కే) ప్రారంభోత్సవ కార్యక్రమంలో చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఎంఈఏ మంత్రి సుష్మాస్వరాజ్ విజన్, సామాన్యుడికి సైతం పాస్‌పోర్టు సౌకర్యాన్ని అందించడమని, భవిష్యత్తులో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పాస్‌పోర్టు సెంటర్ వస్తుందని చెప్పారు. ఇదే సమయంలో నాదియా జిల్లా కిషనానగర్‌లో మరో పీఓపీఎస్‌కేను కూడా మంత్రి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. గతంలో మీరు ఊహించని ప్రాంతాలకు కూడా పాస్‌పోర్టు ఆఫీసులు వస్తాయన్నారు. ఒకటిన్నర సంవత్సరం క్రితం ఈ ప్రాజెక్టును ప్రారంభించామని, ప్రస్తుతం ఇది శరవేగంగా దూసుకెళ్తుందని, వచ్చే రోజుల్లో ఈ కార్యక్రమంపై విశేష పెరుగుదల చూస్తారని మంత్రి చెప్పారు.
గతంలో పాస్‌పోర్టు కోసం ప్రజలు అన్వేసించేవారని, కానీ భవిష్యత్తులో పాస్‌పోర్టు ఆఫీసులే ప్రజల కోసం అన్వేసించేలా చేయాలని ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. అప్పర్ క్లాస్ సేవా నుంచి గరీవ్ సేవాను ఇవ్వాలని తాము కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. ఇలాంటి ఆఫీసులోనే సిలిగురి, డార్జిలింగ్ వంటి ప్రాంతాల్లో కూడా ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు.
Advertisement
Advertisement