2 నెలల్లో జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 ప్రయోగం | GSLV Mark-3 experiment in two months | Sakshi
Sakshi News home page

2 నెలల్లో జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 ప్రయోగం

Published Sat, Mar 18 2017 4:52 AM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM

2 నెలల్లో జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 ప్రయోగం

2 నెలల్లో జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 ప్రయోగం

అత్యంత శక్తివంతమైన ఉపగ్రహ వాహక నౌక జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 ని మరో రెండు నెలల్లో ప్రయోగిస్తామని ఇస్రో సీనియర్‌ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ టీజీకే మూర్తి చెప్పారు.

కోల్‌కతా: అత్యంత శక్తివంతమైన ఉపగ్రహ వాహక నౌక జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 ని మరో రెండు నెలల్లో ప్రయోగిస్తామని ఇస్రో సీనియర్‌ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ టీజీకే మూర్తి చెప్పారు. సమీప భవిష్యత్తులో భారత గడ్డపై నుంచి 4 ఉపగ్రహాల్ని ప్రయోగిస్తున్నామని ఆయన వెల్లడించారు. కోల్‌కతాలో జరుగుతున్న ‘అడ్వాన్సెస్‌ ఇన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ మూడు రోజుల సదస్సులో ప్రసంగిస్తూ... జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 కోసం అధిక ఒత్తిడితో కూడిన క్రయోజెనిక్‌ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించామని తెలిపారు.

కాగా ఈ నెలలో ‘సార్క్‌’ ఉపగ్రహాన్ని ఇస్రో అంతరిక్షంలోకి పంపుతుందని, సార్క్‌ సభ్య దేశాలకు ఆ ఉపగ్రహ ప్రయోజనాలు ఇవ్వాలని ప్రధాని ఎంతో ఆసక్తిగా ఉన్నారని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement