గుల్బర్గ్ కేసులో 11మందికి జీవిత ఖైదు | Gulbarg Case verdict: 11 accused awarded life imprisonment and remaining 12 to be jailed for seven years | Sakshi
Sakshi News home page

గుల్బర్గ్ కేసులో 11మందికి జీవిత ఖైదు

Published Fri, Jun 17 2016 11:31 AM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

గుల్బర్గ్ కేసులో 11మందికి జీవిత ఖైదు

గుల్బర్గ్ కేసులో 11మందికి జీవిత ఖైదు

గుల్బర్గ్ సొసైటీ హత్యాకాండ దోషులకు శిక్ష ఖరారైంది. ఈ కేసులో దోషులుగా తేల్చిన 24 మందిలో 11మందికి జీవిత ఖైదు విధించారు.. మరో పన్నెండుమందికి ఏడేళ్లు.. మరొకరికి పదేళ్ల శిక్షను విధిస్తూ ప్రత్యేక విచారణ కోర్టు శుక్రవారం తీర్పును వెల్లడించింది.

గుజరాత్: గుల్బర్గ్ సొసైటీ హత్యాకాండ దోషులకు శిక్ష ఖరారైంది. ఈ కేసులో దోషులుగా తేల్చిన 24 మందిలో 11మందికి జీవిత ఖైదు విధించారు.. మరో పన్నెండుమందికి ఏడేళ్లు.. మరొకరికి పదేళ్ల శిక్షను విధిస్తూ ప్రత్యేక విచారణ కోర్టు శుక్రవారం తీర్పును వెల్లడించింది. కాగా, ఇప్పటికే ఈ కేసులో 36మందిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. గుల్బర్గా సొసైటీ హత్యాకాండలో కాంగ్రెస్ మాజీ ఎంపీ అహెసాన్ జాఫరి సహా 69మంది సజీవ దహనం అయ్యారు. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

తొమ్మిదేళ్ళ క్రితం గోద్రా రైలు దుర్ఘటన అనంతరం 2002 ఫిబ్రవరి 28న గుల్బర్గా సొసైటీ అల్లర్లలో ఎహసాన్‌ జాఫ్రితో సహా 69 మంది మరణించారు. తొలుత దీనిపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక విచారణా బృందం (సిట్‌) దర్యాప్తు చేసి 63మందిని విచారణలో చేర్చింది. గుల్బర్గ సొసైటీ అల్లర్ల కేసులో మోడీ, తదితరులపై జకియా చేసిన ఫిర్యాదు ఆధారంగా సుప్రీంకోర్టు సిట్‌ను విచారణకు నియమించింది. అయితే ఈ కేసు నుంచి మోదీకి ఊరట లభించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement