మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఒకరు హతం
న్యూఢిల్లీ: ఓపక్క యూరీ సెక్టార్లోని ఆర్మీ ప్రధాన బేస్ క్యాంపు దాడి ఘటన ఆలోచననుంచి బయటపడకముందే మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. హంద్వారాలోని పోలీసు తనిఖీ కేంద్రంపై దాడి చేశారు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉన్న పోలీసు బలగాలు ప్రతి ఘటించడంతో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
యూరీ సెక్టార్ లోని ఆర్మీ క్యాంపుపై పాక్ కు చెందిన ఉగ్రవాదులు దాడులకు పాల్పడటంతో 18మంది సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘటనపైనే చర్చ జరుగుతుండగా హంద్వారాలో ఇలాంటి దాడి ప్రయత్నమే మరొకటి చోటుచేసుకుంది. శ్రీనగర్ కు 70 కిలోమీటర్ల దూరంలో హంద్వారా ఉంటుంది.