5 గంటల్లో మళ్లీ సీఎంగా నితీశ్‌‌.. | How Nitish Kumar returned to NDA fold in 5 hours | Sakshi
Sakshi News home page

5 గంటల్లో మళ్లీ సీఎంగా నితీశ్‌‌..

Published Wed, Jul 26 2017 11:33 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

5 గంటల్లో మళ్లీ సీఎంగా నితీశ్‌‌.. - Sakshi

5 గంటల్లో మళ్లీ సీఎంగా నితీశ్‌‌..

పట్నా :
ఢిల్లీ నుంచి చకాచక్‌ నిర్ణయాలు.. పట్నాలో ఫటాఫట్‌ పనులు.. ఐదంటే ఐదే గంటల్లో బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే కూటమిలోకి బీజేపీ వచ్చి చేరింది. కాషాయపెద్దలు ఇచ్చిన హామీ ప్రకారం.. గంటల వ్యవధిలోనే నితీశ్‌ కుమార్‌కు తన ముఖ్యమంత్రి పదవి తిరిగి దక్కింది.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ కుటుంబం(ఆర్జేడీ)తో కొనసాగబోనన్న బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌.. తన పార్టీ(జేడీయూ) ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం బుధవారం సాయంత్రం 6:30 గంటలకు గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠికి రాజీనామా సమర్పించారు. ఆయన రాజ్‌భవన్‌ గేటు దాటకముందే బీజేపీ తన మద్దతును అధికారికంగా ప్రకటించింది. దీంతో రాత్రి 10:30 గంటలకు గవర్నర్‌ త్రిపాఠి కీలక నిర్ణయం తీసుకున్నారు.

బిహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు నితీశ్‌ను ఆహ్వానించారు. గురువారం నితీశ్‌ బిహార్‌ సీఎంగా మరోసారి ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలు హాజరుకావచ్చని శ్రేణులు భావిస్తున్నాయి.

లాలు ప్రసాద్‌ తనయుడు తేజస్విపై అవినీతి ఆరోపణలు, సీబీఐ కేసు నేపథ్యంలో అధికార మహాకూటమిలో మిత్రపక్షాలైన ఆర్జేడీ, జేడీయూ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. రాజ్‌భవన్‌లో రాజీనామా లేఖ ఇచ్చిన కొద్ది వ్యవధిలోనే జేడీయూ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలతో ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఆర్జేడీ తరపున నితీష్‌ కుమార్‌ బీజేపీ తరపున సుశీల్‌ కుమార్‌ మోదీలు నేతృత్వం వహించారు.

కాగా, నితీశ్‌ మహాకూటమికి మహాద్రోహం తలపెట్టాడని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మండిపడ్డారు. బిహార్‌ లోని పలు ప్రాంతాల్లో నితీశ్‌కు వ్యతిరేకంగా ఆర్జేడీ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement