సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో సకాలం లో విద్యా సంవత్సరం ప్రారంభించలేని ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నత విద్యలో సిలబస్, పని దినాలను కుదించేందుకు ఎంహెచ్‌ఆర్‌డీ చర్యలు చేపట్టింది. ఇందుకోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ప్రజలు, విద్యార్థులు, విద్యావేత్తల భాగస్వామ్యంతోనే సిలబస్ కుదింపు, పని దినాల తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనికోసం ‘సిలబస్ ఫర్ స్టూడెంట్స్–2020’ పేర అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఎంహెచ్‌ఆర్‌డీ ట్విట్టర్ ఖాతాకు లేదా తన ట్విట్టర్ ఖాతాకు అభిప్రాయాలను పంపించాలన్నారు. ఫేస్‌బుక్ ద్వారా కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు అభిప్రాయాలను పంపించాలని సూచిం చారు. మంత్రి చేపట్టిన ఈ కార్యాచరణకు అనుగుణంగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) కసరత్తు ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment