స్కూటర్‌ను ఢీ కొట్టి.. 8 కి.మీ. లాక్కెళ్లి...
న్యూఢిల్లీ: అతివేగంతో స్కూటర్‌ను ఢీకొట్టిన ఓ ట్రక్కు డ్రైవర్.. స్కూటర్‌పై ఉన్న వ్యక్తిని 8 కి.మీ.లు ట్రక్కుతో లాక్కెళ్లాడు. ఈ ఘటన ఢిల్లీ లజపత్ నగర్‌లో జరిగింది. హోటల్‌లో వెయిటర్‌గా పనిచేసే ఫవాద్ అహ్మద్(18) తన ఇద్దరు స్నేహితులతో కలసి లజపత్ నగర్‌లో మంగళవారం వేకువజామున స్కూటర్ పై వెళ్తున్నాడు.వేగంతో వచ్చిన ట్రక్కు స్కూటర్‌ను వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో.. విరిగిన స్కూటర్‌తో పాటు అహ్మద్ మృతదేహం ట్రక్కు కింద మధ్యభాగంలో ఇరుక్కుంది.
స్కూటర్‌పై ఉన్న మిత్రులు చెరోవైపు పడిపోయి ట్రక్కు డంపర్‌ని పట్టుకొని వాహనాన్ని ఆపాలని అరవగా ట్రక్కు క్లీనర్ ఇనుపరాడ్‌తో వారిద్దరిని కొట్టాడు. అటుగా వచ్చిన వ్యక్తి పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తెల్లవారుజామున మాలవీయలో ట్రక్కు ఆపి, డ్రైవర్, క్లీనర్‌లను అరెస్టుచేశారు.