రాహుల్కు సుప్రీంకోర్టు షాక్.. అల్టిమేటం | Huge setback! SC asks Rahul Gandhi to apologise or face trial for blaming RSS for assassination of Mahatma Gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్కు సుప్రీంకోర్టు షాక్.. అల్టిమేటం

Published Tue, Jul 19 2016 12:37 PM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

రాహుల్కు సుప్రీంకోర్టు షాక్.. అల్టిమేటం - Sakshi

రాహుల్కు సుప్రీంకోర్టు షాక్.. అల్టిమేటం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహాత్మాగాంధీని ఆరెస్సెస్ హత్య చేసిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. నేరుగా ఒక సంస్థపై ఇంతపెద్ద దోషాన్ని ఎలా మోపగలవు.. ఆ వ్యాఖ్యలను ఎలా సమర్థించగలవు అంటూ ప్రశ్నించింది. తప్పకుండా విచారణకు హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. అందుకుగాను రాహుల్ గాంధీకి ఈ నెల27వరకు గడువు ఇచ్చింది.

బాపూజీ హత్య ఆరెస్సెస్ చేసిందంటూ రాహుల్ గాంధీ గతంలో ఆరోపణలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆరెస్సెస్ సుప్రీంకోర్టులో పరువు నష్టం దావా వేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రాహుల్ క్షమాపణలు చెప్పడమో లేదంటే ఆయన చేసిన ఆరోపణలు నిరూపించుకోగలగడమో చేయాలని చెప్పింది. 'ఒక అంశాన్ని యోగ్యత ఆధారంగా నిర్ణయించాలి. మీరు ఏం మాట్లాడుతున్నారో అది ప్రజల మంచికా కాదా అనే విషయాన్ని ఆలోచించాలి. ఒక సంస్థపై నేరుగా దోషారోపణ చేయలేరు' అని అంటూ సుప్రీంకోర్టు రాహుల్ కు అల్టిమేటం ఇచ్చింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement