
కరీనా కపూర్
న్యూఢిల్లీ: 'లవ్ జిహాద్' భావనని గానీ, అటువంటి సిద్ధాంతాలను గానీ తాను నమ్మనని బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్ స్పష్టం చేశారు. తాను ప్రేమను మాత్రమే నమ్ముతానని చెప్పారు. ఇద్దరు మనుషుల మధ్య కులం, మతం లేదా మతవిశ్వాసాలతో ప్రమేయం లేకుండానే ప్రేమ ఏర్పడుతుందన్నారు. అందుకే తనకు లవ్ జిహాద్ వంటి భావనలపై నమ్మకం లేదని చెప్పారు.హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకుని, వారిని ముస్లిం మతంలోకి మార్చేందుకు 'లవ్ జిహాద్' నడుపుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో... నటుడు సైఫ్ అలీఖాన్‌ను పెళ్లాడిన కరీనా ఈ మేరకు తన అభిప్రాయం తెలిపారు.
ఢిల్లీలో ఛాందినీ చౌక్ లో తన కొత్త చిత్రం 'భజరంగి భాయ్‌జాన్' సినిమా షూటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైఫ్ విశాల దృక్పదం గత వ్యక్తి అని తెలిపారు. లవ్ జిహాద్‌పై తను ఒక బహిరంగ లేఖ ద్వారా అభిప్రాయం కూడా తెలియజేశారని చెప్పారు. హిందువునైన తను, సైఫ్ రిజిస్టర్ వివాహం చేసుకున్నట్లు తెలిపారు.
**