అత్యంత ప్రతిభావంత ఐఏఎస్ అధికారిగా పేరుగడించిన రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్ డీ.కే రవి మరణం ఉభయ సభల్లో ప్రతిధ్వనించింది.
బెంగళూరు: అత్యంత ప్రతిభావంత ఐఏఎస్ అధికారిగా పేరుగడించిన రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్ డీ.కే రవి మరణం ఉభయ సభల్లో ప్రతిధ్వనించింది. ఆయన మరణానికి సంబంధించిన నిజాలు వెలికి తీయడానికి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని విపక్షాలు పట్టుబడ్డాయి. అయితే సీఐడీ దర్యాప్తునకు మాత్రం అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటన పట్ల ఉభయ సభల సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సభా కార్యక్రమాలను ని ర్వహించడానికి వీలుకాక పోవడంతో స్పీకర్ కాగోడు తిమ్మ ప్ప, మండలి అధ్యక్షుడు శంకరమూర్తి సభలను నేటి (బుధవారం)కి వాయిదా వేశారు. అయితే సీబీఐ దర్యాప్తునకు అంగీకరించేంత వరకూ సభల నుంచి బ యటకు వెళ్లేదిలేదని ఉభయసభల్లోని విపక్ష సభ్యులు భీష్మించారు. మంగళవారం రాత్రి పొద్దుపోయేవరకూ అటు శాసనసభలో, ఇటు విధాన పరిషత్‌లో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు.
ముమ్మాటికీ హత్యే..
శాసనసభలో మంగళవారం సభా కార్యక్రమాలు మొదలైన వెంటనే విపక్షనాయకుడు జగదీష్‌శెట్టర్, స్పీకర్ కా గోడు తిమ్మప్ప అనుమతితో చర్చను ప్రారంభిస్తూ ‘ ఐ ఏఎస్ అధికారి అయిన డీ.కే రవి ఆత్మహత్య చేసుకునేం త పిరికివారు కాదు. విధుల్లో ఆయన నిబద్దతే ఇందుకు సాక్షి. అందువల్ల ఇది ముమ్మాటికీ హత్యే. ఈ హత్య వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలియడానికి సీబీఐతో దర్యాప్తు జరిపించాలి.’ అని పట్టుబట్టారు.
జేడీఎస్ నా యకుడు వై.ఎస్.వి దత్తా మాట్లాడుతూ... దుబాయ్ నుంచి మూడు రోజుల ముందు డీ.కే రవికు భూ మా ఫియా నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయన్న సమాచారం ఉందన్నారు. డీ.కే రవి చనిపోయిన రోజు మధ్యాహ్నం ముగ్గురు అపరిచిత వ్యక్తులు ఆయన ఫ్లాట్‌కు వెళ్లారన్నారు. అయితే వారు ఎవరనే విషయంపై స్పష్ట త లేదన్నారు. ఇలాంటి విషయాలన్నీ బయటకు రావాలంటే సీబీఐ ద్వారానే దర్యాప్తు జరిపించాలని పేర్కొన్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కలుగజేసుకుని ‘మన రాష్ట్రంలో కూడా ప్రతిభావంత పోలీస్ అధికారులు ఉన్నారు. అందువల్ల డీ.కే రవి మరణానికి సంబంధించి సీఐడీ చేత దర్యాప్తు జరిపించనున్నాం.’ అని పేర్కొన్నారు. దీంతో అధికార విపక్షాల మ ధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. స్పీకర్ కాగోడు తిమ్మప్ప పలుమార్లు సభను వాయిదా వేసి అధికార ,విపక్షాలతో మాట్లాడి సమస్యను పరిష్కారించడానికి ప్రయత్నిం చినా ఆయన చర్చలు ఫలించలేదు. డి.కె.రవి అనుమానాస్పద మృతికి సంబంధించిన కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగించేంతవరకూ శాసనసభ నుంచి బయటకు వెళ్లేది లేదని బీజేపీతోపాటు జేడీఎస్ నాయకులు భీ ష్మించారు. ఎవరినో రక్షించేందుకు సీబీఐ బదులు సీఐడీ కి ఈ కేసును అప్పగించడానికి ప్రభుత్వం ఆరాటపడుతోందని తీవ్ర విమర్శనలు చేస్తూ అక్కడే నిరసనకు దిగారు. రాత్రి పొద్దుపోయే వరకూ శాసనసభలో విపక్షాల నిరసన కొనసాగింది. ఇదిలా ఉండగా కవరేజీ కోసం వెళ్లిన మీడియాను అక్కడి నుంచి మార్షల్ బయటకు పంపించేశారు.
ఓ మంత్రి ఒత్తిడే కారణం..
శాసనమండలిలో కూడా డీ.కే రవి మరణానికి సంబంధించి చర్చ అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదానికి కారణమైంది. సభాకార్యక్రమాలు మొదలైన వెంటనే ఈశ్వరప్ప మాట్లాడుతూ...రాష్ట్రంలో నిజాయితీగా పని చేసే అధికారులకు రక్షణ లేదన్నారు. ఇందుకు డీ.కే రవి ఉదంతమే ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రి మహదేవప్ప కలుగజేసుకోవడానికి ప్రయత్నించగా ఈ ఉదంతంలో మీ హస్తం ఏమైనా ఉందా? అని ఈశ్వరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా పోస్ట్‌మార్టం నివేదికకు ముందే డీ.కే రవి మరణాన్ని ఆత్మహత్యగా పేర్కొన్న నగర కమిషనర్ ఎం.ఎన్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఎమ్మెల్సీ సోమణ్ణ మాట్లాడుతూ...‘వివిధ రకాల వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిద్ధరామయ్య మంత్రి మండలిలోని ఓ మంత్రి ప్రభుత్వానికి రూ.42 కోట్లను పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంది.
ఈ విషయం పై నివేదిక తయారు చేసిన డీ.కే రవి పై ఒత్తిడి తెచ్చిన ఆ మంత్రి తాను చెల్లించాల్సిన పన్నులను తగ్గిం చాలన్నారు. అయితే ఇందుకు రవి ఒప్పుకోక పోవడం తో ఇతర మార్గాల ద్వారా పన్నులను రూ.40 లక్షలుగా చూపించి ఆమేరకు చెల్లించారు. ఈ విషయంలో డీ.కే ర వికి బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ విషయమై నిజా లు తేలాలంటే సీబీఐచేత దర్యాప్తు జరిపించాలి’ అని పేర్కొన్నారు. అక్కడే ఉన్న కే.జే జార్జ్ మాట్లాడుతూ... ‘వ్యక్తిగత కారణాలే డీ.కే రవి మరణానికి కారణమని ప్ర స్తుతం మా వద్ద ఆధారాలు ఉన్నాయి. సీఐడీ ద్వారా ద ర్యాప్తు జరిపించి పది రోజుల్లో ప్రాథమిక నివేదికను ఆ ధారాలతో సహా ఉభయ సభలకు అందజేస్తాను.’ అని పేర్కొన్నారు. ఇందుకు విపక్ష సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిం ది. సభను పలుమార్లు వాయిదా వేసి సభ్యుల మధ్య సంధానానికి ప్రయత్నించినా చర్చలు సఫలీకృతం కాకపోవడంతో అధ్యక్షుడు శంకరమూర్తి సైతం మండలిని బుధవారానికి వాయిదా వేశారు. దీంతో విధానపరిషత్‌లోని విపక్ష సభ్యులు సైతం నిరసనకు దిగారు.