రూ. 50 ఇస్తే పఠాన్కోట్ ఎయిర్బేస్లోకి! | Illegal entry was allowed at Pathankot Airbase for Rs 50, reveals attack probe | Sakshi
Sakshi News home page

రూ. 50 ఇస్తే పఠాన్కోట్ ఎయిర్బేస్లోకి!

Published Tue, Jan 12 2016 3:59 PM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM

రూ. 50 ఇస్తే పఠాన్కోట్ ఎయిర్బేస్లోకి!

రూ. 50 ఇస్తే పఠాన్కోట్ ఎయిర్బేస్లోకి!

న్యూఢిల్లీ: పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఉగ్రదాడి ఘటనలో భద్రతపరమైన లోపాలున్నట్టు విచారణలో వెల్లడైంది. ఎయిర్బేస్ వద్ద తగినంత భద్రత లేదని, 50 రూపాయలు తీసుకుని స్థానికులను అక్రమంగా ఎయిర్బేస్లోకి అనుమతించేవారని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఎయిర్బేస్ లోపల ఉగ్రవాదులు దాడి చేయడానికి స్థానికంగా సాయం అందిందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. కాల్ డేటాను పరిశీలించి ఉగ్రవాదులకు సాయపడిన వారిని గుర్తించే దిశగా విచారణ చేస్తున్నారు.

ఇటీవల పఠాన్కోట్ ఎయిర్బేస్ పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆరుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు హతమార్చగా, ఏడుగురు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ చేస్తోంది. అనుమానాస్పదంగా వ్యవహరించిన గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ను రెండో రోజు మంగళవారం కూడా ఎన్ఐఏ విచారించింది. ఆయన సమాధానాల పట్ల ఎన్ఐఏ సంతృప్తి చెందలేదు. మరోసారి ఆయన్ను ప్రశ్నించనున్నారు. అలాగే లై డిటెక్టర్ పరీక్ష కూడా నిర్వహించే అవకాశముంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement