ఇండోర్ : 'బయట కరోనా ఉందిరా నాయనా.. ఎవరు బయటికి రాకండి.. ఇంట్లోనే ఉంటూ హాయిగా ఉండండిరా' అంటే ఎవరు మాట వినడం లేదు. కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినా ప్రజలు అనవసరంగా బయటికి వచ్చి ఇబ్బందుల పాలవుతున్నారు. పోలీసులు కూడా చెప్పి చెప్పి విసుగెత్తిపోతున్నారు. ఇక లాభం లేదనుకొని లాక్‌డౌన్ ఉల్లంఘించి అనవసరంగా బయటికి వస్తున్న వారికి తమదైన శైలిలో బుద్ది చెబుతున్నారు.
తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లఘించి మార్నింగ్ వాక్‌కు వచ్చిన కొంతమందిని జంపింగ్ ఫ్రాగ్స్, మొకాళ్ల మీద నడవడం లాంటివి చేపించారు. వీళ్లందరిని వారి ఇంటివరకు జంపింగ్ ఫ్రాగ్స్ చేయించి మరీ తీసుకెళ్లారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ 'మంచిగా చెబితే ఎవరు వినడం లేదు.. అందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.. వారికి మంచి వ్యాయామంలా ఉంటునే ఇంకెప్పుడు బయటికి రకూడదని వారు భావించాలనే ఇటువంటి చేస్తున్నాం.. దీనితోనైనా వారిలో మార్పు రావాలని కోరుకుంటున్నాం' అని తెలిపారు. (‘చైనా కిట్లలో నాణ్యత కలదు’)
ఇలాంటి ఘటనలు కొత్తేం కాదని చెప్పవచ్చు. ఇంతకుముందు లాక్‌డౌన్ ఉల్లఘించారంటూ మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో వ్యాయామం, యోగా కార్యక్రమాలు నిర్వహించారు. లాక్‌డౌన్ ఉల్లఘించారన్న కారణంతో ఇప్పటికే మహారాష్ట్రలో దాదాపు 35వేల మందిపై , ఉత్తర్ ప్రదేశ్‌లో 24వేలమందిపై ఎఫ్ఐఆర్‌లు, 71వేలమందిపై వివిధ రకాల కేసులు నమోదయ్యాయని అక్కడి పోలీసులు పేర్కొన్నారు. ఇంత చేసినా ప్రజలు ఎప్పటిలాగే మళ్లీ బయటకు వస్తున్నారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20వేలకు చేరుకోగా, మృతుల సంఖ్య 600 దాటేసింది.
Comments
Please login to add a commentAdd a comment