భోపాల్ : కరోనా కట్టడికి మరింత కఠినంగా ఆంక్షలను విధిస్తూ బుధవారం మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బహిరంగ సమావేశాలన్నింటినీ నిషేధించిన రాష్ర్టం.. వివాహాలు, ఇతర సామాజిక కార్యక్రమాలకు సంబంధించి పరిమితులు విధించింది. వివాహ వేడుకల్లో 20కి మించరాదని, పుట్టినరోజు సహా మరే ఇతర కార్యక్రమాల్లోనూ 10 మందికి మించి సమావేశం కాకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు రాష్ర్ట హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రార్థనా మందిరాల్లో సైతం ఒకేసారి ఐదురికి మించరాదని పేర్కొంది.
వివాహ వేడుకలకు 50, అంత్యక్రియలకు 20 మందికి మించరాదని కేంద్రం మే నెలలోనే స్పష్టంచేసింది. పలు రాష్ర్టాలు సైతం దీన్నే అవలంభిస్తున్నాయి. కరోనా కేసులు అధికమవుతున్నందున ఆంక్షలను మరింత కఠినం చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అంత్యక్రియలకు పాల్గొనే వారి సంఖ్య 20కు మించరాదని పేర్కొంటూ ఉత్తర్వులు జారీచేసింది. రెండు రోజుల క్రితం పంజాబ్ రాష్ర్టం సైతం లాక్‌డౌన్ అమలులో ఇదే తరహా మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. (పంజాబ్‌లో లాక్‌డౌన్ ఆంక్షలు మరింత కఠినం)
మధ్యప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లోనే 798 కొత్త కరోనా కేసులు నమోదుకాగా ఒకే రోజులో ఈ స్థాయిలో కేసులు నమోదవుడం ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు. ఇక రాష్ర్ట వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 19,000కు పైగా నమోదయినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.
Not more than 20 people are allowed at wedding functions and not more than 10 people at family functions, birthday and other celebrations. Twenty people can participate in the last rites: Madhya Pradesh Home Department https://t.co/Y0sWo9X7Pl
— ANI (@ANI) July 14, 2020
Comments
Please login to add a commentAdd a comment