న్యూఢిల్లీ : కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్ సందర్భంగా శాంతి భద్రతలు కాపాడుతున్న పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ(ఐసిస్) దాడులకు కుట్రలు పన్నుతుందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఢిల్లీలోని భద్రత అధికారులపై పెద్ద ఎత్తున దాడులు జరిపేందకు ఐసిస్ ప్లాన్ చేస్తున్నట్టుగా నిఘా వర్గాలకు సమాచాం అందింది. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. అలాగే ఐసిస్ ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడే అవకాశం ఉన్నందున్న తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
తొక్కిసలాట రూపంలోగానీ, కాల్పులు జరపడం ద్వారా గానీ, పెద్ద వాహనంతో పోలీసు పికెట్‌పైకి దూసుకురావడం ద్వారా గానీ ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment