ఢిల్లీ : లాక్‌డౌన్ కారణంగా అంత్యక్రియలు జరిపించడానికి బంధువులెవరూ ముందుకు రాకపోవడంతో పోలీసులే దహన సంస్కారాలు జరిపించారు. ఈ ఘటన ఢిల్లీలోని జైత్‌పూర్‌లో చోటుచేసుకుంది. అమృత్‌సర్‌కు చెందని జస్పాల్ సింగ్, సుధా కశ్యప్ భార్యాభర్తలు. చాలా ఏళ్ల క్రితమే ఈ కుటుంబం ఢిల్లీలో స్థిరపడింది. అనారోగ్యం కారణంగా సుధా కశ్యప్ (62) మంగళవారం కన్నుమూసింది. ఈ దంపతులకు 26 ఏళ్ల కుమారుడు ఉన్నా అతను మానసిక వికలాంగుడు. (స్వామీజీ అంత్యక్రియల్లో నిబంధనల ఉల్లంఘన )
లాక్‌డౌన్ కారణంగా బంధువులెవరూ రాలేదు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇంటి పక్కన వాళ్లు కూడా అంత్యక్రియలు జరిపించడానికి విముఖత వ్యక్తం చేశారు. దీంతో భార్య అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో పోలీసులకు ఫోన్ చేసి వివరించాడు. దీంతో ఢిల్లీ పోలీసులు అంత్యక్రియలు జరపడానికి ముందుకు వచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. స్వయంగా మృతదేహాన్ని భుజాలపై మోస్తూ చివరి కర్మలు జరిపించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో పెట్టడంతో పోలీసులపై నెటిజన్తు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment