న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఉగ్ర కుట్రను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అడ్డుకున్నారు. పక్కా సమాచారంతో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) టెర్రరిస్టును అరెస్టు చేశారు. అతన్ని ఐసిస్‌కు ఉగ్రవాద గ్రూపునకు చెందిన అబు యూసుఫ్ ఖాన్‌గా పోలీసులు గుర్తించారు. టెర్రరిస్టు నుంచి ఒక గన్, రెండు ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకున్నట్టు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ప్రమోద్ సింగ్ కుశ్వారా మీడియాతో చెప్పారు. అబు యూసుఫ్‌ను పట్టుకునే క్రమంలో గత అర్ధరాత్రి దౌలా కువా, కరోల్ బాగ్ వద్ద ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు.
ఢిల్లీలో ఓ ప్రముఖ వ్యక్తిని హతమార్చేందుకు అబు యూసుఫ్ నగరానికి వచ్చినట్టు తెలుస్తోందని అన్నారు. తన కుట్రకు సంబంధించి ఉగ్రవాది రెక్కీ కూడా నిర్వహించినట్టు సమాచారం. ఇక అబు యూసుఫ్‌కు ఢిల్లీలోని కొందరు సహాయసహకారాలు అందిస్తున్నారని వారిని వెతికి పట్టుకునే పనిలో ఉన్నామని డిప్యూటీ కమిషన్ ప్రమోద్ సింగ్ కుశ్వారా వెల్లడించారు. కాగా, అబు యూసుఫ్ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలరామ్‌పూర్‌గా విచారణలో తేలిందని చెప్పారు. యూపీలోని అతని నివాసాలపై దాడులు చేపట్టినట్టు ప్రమోద్ సింగ్ పేర్కొన్నారు.
(చదవండి: ఐసిస్ కొత్త లీడరే అమెరికా టార్గెట్: ట్రంప్)
Comments
Please login to add a commentAdd a comment