Islamic State (ISIS)
-
సిరియా భవిష్యత్తు ఏమిటి?
సంక్షోభంలో కూరుకు పోయిన సిరియాలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటయ్యింది. 13 ఏళ్ల అంతర్యు ద్ధాన్ని, ఐదు దశాబ్దాల నియంతల కుటుంబ పాలనను చవిచూసిన ఆ దేశం ఇప్పుడు కొత్త గాలుల్ని పీల్చుకుంటోంది. జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి వస్తోంది. పాఠశాలలు తెరుచుకున్నాయి. పిల్లలు తరగతులకు హాజరవుతున్నారు. జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు బయట కొచ్చారు. దాదాపు 7,600 మంది శరణార్థులుగా వెళ్లినవారు టర్కీ సరి హద్దుల మీదుగా తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. సిరియాను 50 ఏళ్ల పాటు అసద్ కుటుంబమే పాలించింది. 2000 నుంచి మొన్న అధికారం కోల్పోయే వరకూ అసద్ పాలిస్తే అంతకు ముందు... 1970 నుంచి 2000 వరకూ అసద్ తండ్రి హఫీజ్ ఏలాడు. ఇద్దరూ నియంతలుగానే పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు 2011లో ప్రారంభమయ్యాయి. ఇవే అంతర్యుద్ధంగా రూపు దాల్చాయి. ఈ యుద్ధంలో లక్షలాది మంది మరణించారు. రష్యా, ఇరాన్ దేశాల మిలటరీ; హెజ్బొల్లా ఆయుధాలతో దేశంలో 2/3 వంతు భూభాగంపై అసద్ తన పట్టు బిగించాడు. సొంత ప్రజలపైనే రసాయన, సిలిండర్ దాడులు చేయించి లక్షలాది మందిని జైళ్లపాలు చేశాడు. దాదాపు 3 లక్షల మంది దాకా జైళ్లలో మగ్గుతూ ఉంటారని అంచనా.అసద్ పాలనలో సిరియా దుర్భర పరిస్థితులను చవి చూసింది. 90 శాతం ప్రజలు దారిద్య్రరేఖ దిగువకి చేరారు. ప్రజలకు 24 గంటల కరెంట్ అందుబాటులో లేదు. మందులు లేవు. పెట్రోలుకి రేషన్ ఉంది. బ్రెడ్ కొనుక్కోవటానికి గంటల తరబడి లైన్లో నిలబడాలి. చాలా మందికి ఉపాధి లేదు. పొట్ట చేతపట్టుకుని ఎక్కడెక్కడికో వెళుతున్నారు. సిరియా పౌండ్ దాని విలువలో 99 శాతం కోల్పో యింది. రాజధాని నగరమైన డమాస్కస్ మినహా దేశం ఏ నగరాన్ని చూసినా ఇప్పుడు యుద్ధం మిగి ల్చిన విధ్వంసపు ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. దేశాన్ని పునర్నిర్మించటానికి 250 బిలియన్ డాలర్లు అవసరం అవుతాయని ఐక్యరాజ్యసమితి అంచనా.అసద్‌ను పదవి నుంచి తొలగించి సున్నీ పాలనను స్థాపించాలనే లక్ష్యంతో పోరాడిన హయత్ తహీర్ ఆల్ షమ్ (హెచ్‌టీఎస్) సంస్థ విజయం సాధించింది. రెండో తిరుగుబాటు బృందం సిరియన్ డెమాక్రటిక్ ఫోర్సెస్ కుర్దుల మిలటెంట్ల సమూహం. మూడోది అటు అసద్‌నూ, ఇటు కుర్దులనూ వ్యతి రేకించే సిరియన్ నేషనల్ ఆర్మీ. సిరియాలో రెబెల్ గ్రూపులకు ప్రధానంగా హెచ్‌టీఎస్‌కు టర్కీ ప్రధాన మద్దతుదారుగా ఉంది. సిరియన్ నేషనల్ ఆర్మీకి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, సైన్యాన్ని అందించటంతో పాటు రాజకీయంగా కూడా మద్దతుగా నిలిచింది. అలాగే సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) గ్రూపునకు వ్యతిరేకంగా అమెరికా పోరాడుతోంది. సిరియా మిలటరీ స్థావరాలపై ఇటీవల కాలంలో అనేక మార్లు ఇజ్రాయెల్ మిస్సైల్ దాడులు చేసింది. ఆగ్నేయ ప్రాంతంలోని క్వెనిత్రా లోని రోడ్లు, విద్యుత్ ప్రసార సాధనాలు, వాటర్ నెటవర్క్స్ను ధ్వంసం చేసింది. తాము సిరియాలో ఉన్న ఇరాన్ మిలటరీ స్థావరాలపై దాడులు చేస్తు న్నామని... ఆ దేశం ఈ దాడులను సమర్థించుకుంటోంది. అసద్‌ను పదవీచ్యుతుడిని చేసిన హెచ్‌టీఎస్ కమాండర్ ఇన్ ఛీఫ్ అహ్మద్ ఆల్ షారా సిరియా నాయకత్వ బాధ్యతలను మహ్మద్ అల్ బషర్ చేతిలో పెట్టారు. ఆయన ఇడిబ్ లోని సిరియన్ సాల్వేషన్ గ్రూపు (ఎస్ఎస్జీ) నాయకుడు. ప్రస్తుతం కేర్ టేకర్ ప్రభుత్వానికి బషర్ నాయకునిగా వ్యవహరిస్తారు. మార్చి 1 వరకూ ఆయన పదవిలో ఉంటారు. పౌర సేవలు సక్రమంగా అందటానికి, సాయుధ దళాల చేతిలోకి అధికార పగ్గాలు వెళ్లకుండా చూడాలనే ఉద్దేశ్యంతో ఈ ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. ఒకప్పుడు ఆల్ ఖైదాకు అనుబంధంగా పని చేసిన హెచ్‌టీఎస్‌ను తీవ్రవాద సంస్థగా ముద్ర వేసినా, ఇప్పుడు హెటీఎస్ నేతలతో బైడెన్ ప్రభుత్వం టచ్‌లో ఉంటోంది. యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకన్ దీనిపై మాట్లాడారు. ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.– డా‘‘ పార్థసారథి చిరువోలు,సీనియర్ జర్నలిస్టు -
సిరియాలో జోక్యం ముస్లింల అణచివేత
రష్యా రాజధాని మాస్కోలో తాజాగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ (ఐసిస్) చేసిన అమానవీయ దాడి ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచింది. రష్యాపై దాడులు ఐసిస్‌కు కొత్తేమీ కాదు. కొన్నేళ్ల కింద రష్యా పౌరులే లక్ష్యంగా విమానాన్నే బాంబుతో పేల్చేసి 244 మందిని బలి తీసుకున్న చరిత్ర దానిది! కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయంపైనా దాడులకు తెగబడింది. సిరియా అంతర్యుద్ధంలో తమకు వ్యతిరేకంగా పుతిన్ జోక్యం రష్యాపై ఐసిస్ ఆగ్రహానికి ప్రధాన కారణం. రష్యాలోని ముస్లింలు తీవ్ర అణచివేతకు గురవుతున్నారన్న వార్తలు దాని విద్వేషాన్ని మరింతగా పెంచి పోషించాయి. ఫలితంగా రష్యాకు, ఐసిస్‌కు మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం నిత్యం నిప్పుల కుంపటి రాజేస్తూనే ఉంది... అలా మొదలైంది... ఐసిస్ అరాచకం 2015లో సిరియాలో అంతర్యుద్ధానికి దారితీసింది. ఐసిస్‌ను అణిచే ప్రయత్నాల్లో అధ్యక్షుడు బషీర్ అల్ అసద్‌కు పుతిన్ దన్నుగా నిలిచారు. దాంతో రష్యాపై ఐసిస్ తీవ్ర ద్వేషం పెంచుకుంది. మాస్కోలో తాజా మారణహోమానికి తెగబడింది ఐసిస్ ఖోరసాన్ (ఐసిస్–కె). ఇది అఫ్గానిస్థాన్‌లో ఐసిస్ అనుబంధ సంస్థ. 2022లో అఫ్గాన్ రాజధాని కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయంపై ఆత్మాహుతి దాడి చేసి ఇద్దరు ఉద్యోగులతో పాటు ఎనిమిది మందిని పొట్టన పెట్టుకుంది ఐసిస్–కెనే. దీన్ని పాకిస్థానీ తాలిబాన్ ముఠా సభ్యులు 2015లో ప్రారంభించారు. అఫ్గాన్‌లో భద్రతా దళాలతో పాటు మంత్రులపై, మైనారిటీలపై వరుస దాడులతో ప్రాచుర్యంలోకి వచి్చంది. 2018కల్లా ప్రపంచంలోని నాలుగు అత్యంత ప్రమాదకరమైన ఉగ్ర సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ఉగ్ర శిక్షణ నిమిత్తం ఇరాక్, సిరియాల్లోని అగ్ర నాయకత్వం నుంచి కోట్లది డాలర్లు అందకుంటూ వచి్చంది. తర్వాత అమెరికా సైన్యం, అఫ్గాన్ కమెండోలు, అఫ్గాన్ తాలిబన్ల ముప్పేట దాడితో ఐసిస్–కె ఆగడాలకు కళ్లెం పడింది. అమెరికా వైమానిక దాడులు దాని అగ్ర నాయకత్వాన్ని దాదాపుగా తుడిచిపెట్టేశాయి. 2021లో అమెరికా సైన్యం అఫ్గాన్ నుంచి వైదొలగడంతో ఐసిస్–కె మళ్లీ పుంజుకుంది. అదే ఏడాది కాబూల్ విమానాశ్రయంపై దాడి చేసి 13 మంది అమెరికా సైనికులతో పాటు ఏకంగా 170 మంది పౌరులను బలి తీసుకుంది. కొన్నేళ్లుగా అఫ్గాన్ ఆవల కూడా విస్తరిస్తోంది. గత జనవరిలో ఇరాన్లో దివంగత మేజర్ జనరల్ ఖాసీం సులేమానీ స్మారక ర్యాలీపై ఆత్మాహుతి దాడికి తెగబడి 84 మందిని పొట్టన పెట్టుకుంది. ఇస్తాంబుల్‌లో ఓ చర్చిపైనా దాడి చేసింది. పుతిన్‌ను, ఆయన విధానాలను ఐసిస్–కె తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెగలపరంగా తమ ప్రబల శత్రువులైన తాలిబన్లతో పుతిన్ సాన్నిహిత్యం రష్యాపై విద్వేషాన్ని మరింత ఎగదోసింది. దీనికి తోడు రష్యాలో ముస్లింలపై అణచివేత పెరుగుతోందని ఆమ్నెస్టీతో పాటు పలు హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. రష్యాలో ముస్లింలు 2 కోట్ల దాకా ఉంటారని అంచనా. మతపరమైన ప్రార్థనలు కూడా చేసుకోలేనంతగా వారిపై తీవ్ర అణచివేత చర్యలు కొనసాగుతున్నాయని, విద్య, ఉపాధి తదితరాల్లో నూ వివక్ష కొనసాగుతోందని వార్తలొస్తున్నాయి. ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న క్రిమియాలో కూడా ముస్లింలపై రష్యా తీవ్ర ఆంక్షలు అమలు చేస్తోందని చెబుతున్నారు. ఇవన్నీ ఐసిస్–కెకు మరింత కంటగింపుగా మారాయి. హిజాబ్ ముస్లిం సంప్రదాయం కాదంటూ పుతిన్ చేసిన వ్యాఖ్యలు రష్యాపై దాని ద్వేషాన్ని మరింతగా పెంచాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐసిస్ చీఫ్ హతం.. కొత్త అధినేతను ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధినేత హసన్ అల్ హషిమీ అల్ ఖురేషి హతమయ్యాడు. సిరియా తిరుగుబాటు శక్తులతో జరిగిన భీకర పోరులో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఐసిస్ బుధవారం ఓ ఆడియో సందేశంలో తెలిపింది. తమ కొత్త నాయకుడిగా అబు అల్ హుస్సేన్ అల్ హుస్సేనీ అల్ ఖురేషిని ఎన్నుకున్నట్లు చెప్పింది. ఐసిస్ అధినేత మరణాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. ఈయన సిరియాలో అమెరికా దళాలను పర్యవేక్షిస్తున్నారు. అక్టోబర్ నెల మధ్యలో దక్షిణ సిరియా రెబల్స్.. హసన్ అల్ హమిషీని హతమార్చినట్లు పేర్కొన్నారు. ఐసిస్ చీఫ్‌గా హసన్ అల్ హషిమీ 9 నెలల క్రితమే బాధ్యతలు చేపట్టాడు. అతనికి ముందు ఈ ఉగ్రవాద సంస్థకు నాయకుడిగా అబు ఇబ్రహీం ఖురేషి ఉండేవాడు. అమెరికా దళాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడ్ని సిరియాలో మట్టుబెట్టాయి. చదవండి: అఫ్గాన్ మదరసాలో పేలుళ్లు... 16 మంది దుర్మరణం -
ప్రవక్తపై వ్యాఖ్యలు: భారత్‌లో ఆత్మాహుతి బాంబు దాడుల వార్నింగ్
మహమ్మద్ ప్రవక్తపై మాజీ బీజేపీ నేతలు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్.. చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా చల్చారలేదు. వారి వ్యాఖ్యల కారణంగా దేశంలో ఇంకా పలు చోట్ల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయంపై నూపుర్ శర్మను హెచ్చరిస్తూ ఉగ్రవాద సంస్థలు ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నూపర్ శర్మ వ్యాఖ్యలకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఐసీస్ వార్నింగ్ ఇచ్చింది. భారత్ అంతటా దాడులు చేస్తామంటూ ఐసీస్ ఖొరాసాన్ హెచ్చరించారు. ఇక గత వారం.. మహమ్మద్ ప్రవక్తను అవమానించినందుకు ప్రతీకారంగా భారత్‌లోని వివిధ నగరాల్లో ఆత్మాహుతి బాంబు దాడులు జరుపుతామంటూ వార్నింగ్ ఇస్తూ అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ (AQIS) ఒక లేఖను జారీ చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు కూడా ఉగ్ర సంస్థ ఎంజీహెచ్ నూపుర్ శర్మకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల చేసినందుకుగానూ బేషరతుగా ప్రపంచానికి క్షమాపణ చెప్పాలని ఒక బెదిరింపు ప్రకటన విడుదల చేసింది. ‘‘నూపుర్ శర్మ తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. మొత్తం ప్రపంచానికి క్షమాపణలు చెప్పాలి. లేకుంటే.. ప్రవక్తను అగౌరవపరిచినందుకు ఏం చేయాలో అది చేస్తాం’’ అంటూ టెలిగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్లో క్రియాశీలకంగా వ్యవహరించే ఈ ఉగ్రసంస్థ.. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ ఘాజీపూర్ పూల మార్కెట్లో ఐఈడీ పేలుడుకు పాల్పడింది. Prophet row: After AQIS, Islamic State wing threatens attacks in India over remarks by Nupur Sharma https://t.co/PQgxW7AAoK — Vinu Mahanthesh G (@iam_mahanthesh) June 15, 2022 ఇది కూడా చదవండి: నేషనల్ హెరాల్డ్ కేసు: మూడో రోజు ఈడీ ముందుకు రాహుల్.. -
12 రాష్ట్రాల్లో యాక్టివ్‌గా ఐసిస్: ఎన్ఐఏ
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఐసిస్ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో యాక్టివ్‌గా ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తెలిపింది. వాటిల్లో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో ఐసిస్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా నిన్న రాజ్యసభలో ఇదే విషయాన్ని వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల్లోని యువత ఐసిస్‌వైపు ఆకర్షితులవుతున్నట్టు నిఘా వర్గాల ద్వారా తెలిసిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఐసిస్ సానుభూతిపరులపై ఇటీవల 17 కేసులు నమోదైనట్టు వెల్లడించారు. 122 మంది నిందితులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఐసిస్ తమ సిద్ధాంతాలను ప్రచారంయువతకు గాలం వేస్తోందని తెలిపారు. ఉగ్ర సంస్థల కార్యకలపాలపై నిఘా కొనసాగుతోందని మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. (చదవండి: పాతబస్తీలోని వ్యభిచారగృహంపై పోలీసుల దాడి) -
ప్రముఖ వ్యక్తి హత్యకు కుట్ర, పోలీసుల చెక్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఉగ్ర కుట్రను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అడ్డుకున్నారు. పక్కా సమాచారంతో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) టెర్రరిస్టును అరెస్టు చేశారు. అతన్ని ఐసిస్‌కు ఉగ్రవాద గ్రూపునకు చెందిన అబు యూసుఫ్ ఖాన్‌గా పోలీసులు గుర్తించారు. టెర్రరిస్టు నుంచి ఒక గన్, రెండు ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకున్నట్టు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ప్రమోద్ సింగ్ కుశ్వారా మీడియాతో చెప్పారు. అబు యూసుఫ్‌ను పట్టుకునే క్రమంలో గత అర్ధరాత్రి దౌలా కువా, కరోల్ బాగ్ వద్ద ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఢిల్లీలో ఓ ప్రముఖ వ్యక్తిని హతమార్చేందుకు అబు యూసుఫ్ నగరానికి వచ్చినట్టు తెలుస్తోందని అన్నారు. తన కుట్రకు సంబంధించి ఉగ్రవాది రెక్కీ కూడా నిర్వహించినట్టు సమాచారం. ఇక అబు యూసుఫ్‌కు ఢిల్లీలోని కొందరు సహాయసహకారాలు అందిస్తున్నారని వారిని వెతికి పట్టుకునే పనిలో ఉన్నామని డిప్యూటీ కమిషన్ ప్రమోద్ సింగ్ కుశ్వారా వెల్లడించారు. కాగా, అబు యూసుఫ్ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలరామ్‌పూర్‌గా విచారణలో తేలిందని చెప్పారు. యూపీలోని అతని నివాసాలపై దాడులు చేపట్టినట్టు ప్రమోద్ సింగ్ పేర్కొన్నారు. (చదవండి: ఐసిస్ కొత్త లీడరే అమెరికా టార్గెట్: ట్రంప్) -
ఉగ్రదాడికి కుట్ర.. ఢిల్లీ పోలీసులకు హెచ్చరిక
న్యూఢిల్లీ : కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్ సందర్భంగా శాంతి భద్రతలు కాపాడుతున్న పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ(ఐసిస్) దాడులకు కుట్రలు పన్నుతుందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఢిల్లీలోని భద్రత అధికారులపై పెద్ద ఎత్తున దాడులు జరిపేందకు ఐసిస్ ప్లాన్ చేస్తున్నట్టుగా నిఘా వర్గాలకు సమాచాం అందింది. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. అలాగే ఐసిస్ ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడే అవకాశం ఉన్నందున్న తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తొక్కిసలాట రూపంలోగానీ, కాల్పులు జరపడం ద్వారా గానీ, పెద్ద వాహనంతో పోలీసు పికెట్‌పైకి దూసుకురావడం ద్వారా గానీ ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. -
ఐసిస్ కొత్త లీడరే అమెరికా టార్గెట్: ట్రంప్
వాషింగ్టన్: ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ కొత్త లీడర్‌పైనే అమెరికా దృష్టి సారించిందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్‌లో మంగళవారం ఆయన మాట్లాడారు. ‘అందరికీ తెలుసు అతను ఎక్కడున్నాడో..’అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొత్త టార్గెట్ పేరుని మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. ఉగ్రసంస్థ చీఫ్ అబూ బాకర్ అల్ బాగ్దాదీని గత నెలలో అమెరికా కమాండోలు చుట్టుముట్టిన నేపథ్యంలో ఆత్మాహుతి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అతని స్థానంలోకి వచ్చిన అబూ ఇబ్రహీం అల్ హష్మీ అల్ ఖురేషీనే అమెరికా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘అమెరికా అల్ బాగ్దాదీని అంతం చేసింది. అతని తర్వాతి వ్యక్తి (నంబర్–2)ని కూడా మట్టుబెట్టింది. ఇప్పుడు మిగిలిన నంబర్–3పైనే మా దృష్టంతా.. అతనికి చాలా సమస్యలున్నాయి. ఎందుకంటే అతను ఎక్కడున్నాడో మాకు తెలుసు కాబట్టి..’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
'అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటాం'
బీరుట్: ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) తమ కొత్త నాయకుడి పేరును ప్రకటించింది. గత వారం సిరియాలో అమెరికా జరిపిన దాడుల్లో ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ హతమైన విషయం తెలిసిందే. తాజాగా ఐసిస్ కొత్త ఛీఫ్‌గా అబూ ఇబ్రహీం అల్ హష్మీని నియమించినట్లు ఆడియో రూపంలో వెల్లడించింది. అలాగే ఉత్తర సిరియా ప్రాంతంలో ఆదివారం కుర్దు సేనలతో కలిసి అమెరికా జరిపిన దాడుల్లో అల్ బాగ్దాదీ అత్యంత సన్నిహితుడు, సంస్థ అధికార ప్రతినిధి హసన్ అల్ ముజాహిర్ కూడా మృతి చెందినట్లు ఆడియో సందేశంలో పేర్కొంది. అయితే ఆడియోలో మాట్లాడిన అబూ హమ్జా అల్ ఖురేషీ ‘ఎక్కువ సంతోషించకండి’ అంటూ అమెరికాకు ఒక హెచ్చరికను జారీచేశాడు. త్వరలోనే బాగ్దాదీ చావుకు కారణమైన అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆడియోలో స్పష్టం చేశారు. గత వారం ఐసిస్‌ను లక్ష్యంగా చేసుకొని జరిపిన సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా ఎనిమిది హెలికాప్టర్లను ఉపయోగించి అమెరికా దళాలు ఈ ఆపరేషన్‌ను పూర్తి చేశాయి. సిరియాలోని ఇడ్లిబ్ ప్రాంతంలో 90 నిమిషాలు పాటు ఈ దాడులు జరిపినట్లు అమెరికా రిలీజ్ చేసిన వీడియోలో బహిర్గతమయింది. -
ఐసిస్ వద్దు బాబోయ్.. వెనక్కొచ్చేస్తా..!!
న్యూఢిల్లీ : అమెరికా సేనలు ఉక్కుపాదం మోపడంతో ఐసిస్ ఉగ్రవాదంవైపు ఆకర్షితులైన యువత తిరుగుముఖం పడుతోంది. తిండీ తిప్పలు కొరవడిన దారుణ పరిస్థితుల నుంచి బయటపడేందుకు యువత యత్నిస్తోంది. తాజాగా కేరళకు చెందిన ఓ యువకుడు స్వదేశానికి తిరిగొస్తానని కుటుంబీకులకు మొరపెట్టుకున్నాడు. వివరాలు.. ఇస్లాం రాజ్యస్థాపన భ్రమలతో ఐసిస్‌లో చేరేందుకు కేరళ నుంచి 12 మంది యువకులు 2016లో పయనమయ్యారు. వారంతా అఫ్గాన్ చేరుకోగా.. ఫిరోజ్ అలియాస్ ఫిరోజ్‌ఖాన్ (25) మాత్రం అక్రమంగా సిరియాలో చొరబడ్డాడు. అయితే, వారి అంచనాలు తల్లక్రిందులయ్యాయి. తీవ్రవాద అంతానికి అగ్రరాజ్యం అమెరికా గట్టి చర్యలు తీసుకోవడంతో ఐసిస్ సంక్షోభంలో పడింది. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దారిద్ర్యంలోకి ఆ ఉగ్రసంస్థ చేరింది. దాంతో అక్కడే ఉంటే ప్రాణాలు నిలుపుకోవడం కష్టమనుకున్న ఫిరోజ్‌ఖాన్ గతనెలలో ఇంటికి ఫోన్ చేశాడు. ఇంటికి తిరిగొస్తానని, పోలీసులకు లొంగిపోతానని చెప్పాడు. అక్కడే మలేషియా అమ్మాయితో తనకు వివాహం చేశారని, తర్వాత ఆమె తనను విడిచి వెళ్లిపోయిందని తల్లితో ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, అతను, ఎప్పుడు ఎక్కడ లొంగిపోతాననే విషయం వెల్లడించలేదని తెలిసింది. ఇక ఫిరోజ్ ఫోన్‌కాల్ గురించి తెలిసిందని భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ‘కుంటుంబ సభ్యులతో ఫిరోజ్ టచ్‌లో ఉన్నట్టు తెలిసింది. గతంతో బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి వారిని ఐసిస్‌లో చేర్పించేందుకు యత్నించాడనే సమాచారముంది. ఐసిస్‌లో చేరండని కాసర్గాడ్ యువతను ప్రలోభపెట్టిన కేసులో అతను కూడా నిందితుడు’ అని సెక్యూరిటీ ఉన్నతాధికారులు తెలిపారు. కన్నూర్ జిల్లా నుంచి 35 మంది వరకు ఐసిస్ బాట పట్టారని, వారిలో చాలామంది అమెరికా సేనల దాడిలో ప్రాణాలు విడిచి ఉండొచ్చని అన్నారు. కన్నూర్ జిల్లాలోని కూడలి ప్రాంతానికి చెందిన షాజహాన్ (32) టర్కీ మీదుగా సిరియా వెళ్తూ పట్టుబడ్డాడని భద్రతా అధికారులు వెల్లడించారు. -
టర్కీలో పెళ్లి వేడుకపై ఉగ్ర పంజా
51 మంది మృతి.. 70 మందికి గాయాలు - ఆత్మాహుతి దాడికి పాల్పడిన 12 ఏళ్ల ఐసిస్ ఉగ్రవాది ఇస్తాంబుల్ : టర్కీలో మరోసారి ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థ పంజా విసిరింది. ఉగ్రవాదిగా మారిన 12 ఏళ్ల బాలుడు ఓ పెళ్లి వేడుకను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 51 మంది మృత్యువాతపడగా.. 70 మందికిపైగా గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున సిరియా సరిహద్దులకు సమీపంలో టర్కీకి దక్షిణాన ఉన్న గజియాన్టెప్ నగరంలో ఈ దాడి చోటుచేసుకుంది. టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆదివారం స్పందిస్తూ.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే ఈ ఆత్మాహుతి దాడి వెనుక ఉన్నట్టు ఆరోపించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాది వయసు 12 ఏళ్లు ఉండొచ్చని చెప్పారు. పెళ్లికి వచ్చిన అతిథులు ముఖ్యంగా కుర్దులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్టు పేర్కొన్నారు. పెళ్లి వేడుక సందర్భంగా ఓ ఉగ్రవాది తనను తాను పేల్చుకోవడంతో 51 మంది మృత్యువాత పడ్డారని, మరో 70 మంది గాయాలపాలయ్యాయని వీరిలో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. టర్కీలో తిరుగుబాటుకు ప్రయత్నించిన అమెరికాకు చెందిన ఫెతుల్లాహ్ గులెన్ ఉగ్రవాద సంస్థ(ఎఫ్‌ఈటీఓ)కు.. నిషేధిత ఉగ్రవాద సంస్థలు ఐసిస్, కుర్దిష్ వర్కర్స్ పార్టీ(పీకేకే) లకు పెద్ద వ్యత్యాసం లేదని ఎర్డోగాన్ చెప్పారు. తమపై దాడికి తెగబడిన వారికి తాము ఇచ్చే సందేశం ఒక్కటే అని ‘మీరు ఎప్పటికీ విజయవంతం కాలేరు’ అని స్పష్టం చేశారు. రక్త దాహానికి అలవాటుపడిన ఉగ్రవాద సంస్థలు, వాటి వెనుక ఉన్న శక్తులు తమ దేశంలో చిచ్చుపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావన్నారు. ఈ ఉగ్రవాద దాడిని అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాలు తీవ్రంగా ఖండించాయి. టర్కీకి తమ మద్దతు కొనసాగిస్తామని, ఉగ్రవాదులపై పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని అమెరికా హామీ ఇచ్చింది. భారత్‌లోకి ఎఫ్‌ఈటీఓ చొరబడింది: టర్కీ న్యూఢిల్లీ: తమ దేశంలో తిరుగుబాటుకు ప్రయత్నించిన ఫెతుల్లాహ్ గులెన్ ఉగ్రవాద సంస్థ(ఎఫ్‌ఈటీఓ) భారత్‌లోకి చొరబడిందని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లట్ కావుసోగ్లు హెచ్చరించారు. ఎఫ్ఈటీఓకు ప్రపంచవ్యాప్తంగా రహస్య నెట్వర్క్ ఉందని, అది ఇప్పుడు కొన్ని సంస్థలు, స్కూళ్ల ద్వారా భారత్‌లోకి కూడా చొరబడిందని వెల్లడించారు. ఎఫ్ఈటీఓను కూకటివేళ్లతో పెకలించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో కావుసోగ్లు సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ అంశాన్ని సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఈ అంశంపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ స్పందిస్తూ.. సున్నితమైన ఈ అంశంపై భారత భద్రతా ఏజెన్సీలు దృష్టి సారిస్తాయని పేర్కొన్నారు. -
అన్నీ అయ్యాకే చెప్పేవాడు!
- ప్రతి వ్యవహారమూ ఇబ్రహీం పర్యవేక్షించాడు - ఐసిస్‌పై ఆసక్తి ఉండటంతోనే మాడ్యూల్లో చేరా - ఓ సమావేశంలో హఠాత్తుగా ‘అమీర్’ను చేశారు - ఎన్ఐఏ విచారణలో నైమతుల్లా హుస్సేనీ వెల్లడి - నలుగురి కస్టడీ పూర్తి, ఒకరికి మాత్రం పొడిగింపు సాక్షి, హైదరాబాద్ : ‘ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థ తరఫున పనిచేయాలనే ఆసక్తి ఉంది. అందుకే ఇబ్రహీంతో కలసి ముఠాలో చేరా. అయితే నేను చేసిందేమీ లేదు’ అని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారుల విచారణలో నైమతుల్లా హుస్సేనీ అలియాస్ యాసిర్ వెల్లడించాడు. మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, మహ్మద్ ఇలియాస్ యజ్దానీలతో పాటు యాసిర్, మహ్మ ద్ అథఉర్ రెహ్మాన్‌ల కస్టడీకి గడువు ముగియడంతో మంగళవారం వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వీరిలో రెహ్మాన్ నుంచి అదనపు సమాచారం రాబట్టాల్సి ఉండటంతో కస్టడీ పొడిగించాల్సిందిగా కోరా రు. దీనికి అంగీకరించిన కోర్టు రెహ్మాన్‌ను మరో వారం ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ, మిగిలిన ముగ్గురికీ జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నిన ఐసిస్ అనుబంధ సంస్థ ‘జుందుల్ ఖిలాఫత్ ఫీ బిలాద్ అల్ హింద్(జేకేబీహెచ్)’ మాడ్యూల్ కుట్రను ఎన్ఐఏ అధికారులు గత నెల 29న భగ్నం చేసి, రెండు దఫాల్లో ఏడుగురిని అరెస్ట్ చేసిన విషయం విదితమే. వీరిలో ఇబ్రహీం యజ్దానీ, ఇలియాస్ యజ్దానీలతో పాటు యాసిర్, మహ్మద్ అథఉర్ రెహ్మాన్‌లను కస్టడీలోకి తీసుకుని విచారించింది. పాతబస్తీలోని మొఘల్‌పుర ప్రాంతానికి చెందిన యాసిర్ ఖైరతాబాద్‌లో రెడీమేడ్ వస్త్రదుకాణం నిర్వహించేవాడు. రెహ్మాన్ ఎంఏ (ఇంగ్లిష్) పూర్తి చేసి.. స్థానికంగా ఇంగ్లిష్ ట్యూషన్లు చెప్పడంతో పాటు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని భావించే వారికి నిర్వహించే ‘టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఫారెన్ లాంగ్వేజ్(టోఫెల్)’ పరీక్షలపై విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చేవాడు. గత ఏడాది ఇబ్రహీం ఇంట్లో అరబిక్ క్లాసులు చెప్పడానికి వచ్చిన నేపథ్యంలో అతడితో యాసిర్‌కు పరిచయమైంది. ఉగ్రవాద భావజాలం ఉండటంతో జేకేబీహెచ్ మాడ్యూల్లో చేరాడు. హ్యాండ్లర్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ విధ్వంసాలకు కుట్ర పన్నుతున్నామని ఇబ్రహీం చెప్పాడని, అప్పటికే ఆసక్తి ఉండటంతో కలసి పనిచేయడానికి అంగీకరించారని ఎన్ఐఏ ఎదుట యాసిర్ చెప్పాడు. తాము తరచూ సమావేశమయ్యే వారమని, ఓ రోజు హఠాత్తుగా మాడ్యూ ల్ చీఫ్(అమీర్)గా తనను ప్రకటించారని వివరించాడు. నాందేడ్, అజ్మీర్, అనంతపురం సహా ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన విషయాన్ని ఆ తర్వాతే తనకు చెప్పారని, నిధుల సమీకరణలో మాత్రం కీలకపాత్ర పోషించానని వెల్లడించాడు. అత్యంత వేగంగా విస్తరించింది: ఎన్ఐఏ ఈ మాడ్యూల్ అత్యంత వేగంగా విస్తరించిందని ఎన్ఐఏ నిర్ధారించింది. అంతా కలసి ముఠాగా ఏర్పడిన 6 నెలల్లోనే హోదాలు ఇచ్చుకోవడం, పేలుడు పదార్థాలు, ఆయుధా ల సమీకరణతో పాటు టార్గెట్ల ఎంపిక, రెక్కీల వరకు చకచకా చేసుకుపోయిందని ఆధారాలు సేకరించింది. దీని గుట్టురట్టు చేయకపోయి ఉంటే భారీ విధ్వంసాలకు దిగేదని, మాడ్యూల్‌లోని సభ్యులందరూ అదే భావజాలం, మానసికస్థితిలో ఉన్నారని అధికారులు చెబు తున్నారు. కస్టడీలో ఉన్న ఉగ్రవాదుల్ని వికారాబాద్ సమీప ప్రాంతాలకు తీసుకెళ్ళిన అధికారులు అక్కడ వారు సంచరించిన ప్రాంతాలను పరిశీలించి ఆధారాలు సేకరించారు. -
ఐసిస్ అధినేత అబూ బకర్కు గాయాలు
లండన్: ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థ చీఫ్ అబు బకర్ అల్-బాగ్దాది వైమానిక దాడిలో తీవ్రంగా గాయపడినట్లు మీడియా నివేదికలు వెల్లడించాయి. గురువారం సంకీర్ణ బలగాల ఆధ్వర్యంలో ఇరాక్‌లో ఈ దాడి జరిగిందని ఇరాక్ న్యూస్ చానెల్ ఈ మేరకు ధ్రువీకరించింది. -
'ఇంటర్నెట్ వాడకం ఉగ్రవాదులకే బాగా తెలుసు'
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల్ని రద్దు చేయాలని అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున రేసులో ముందున్న డోనాల్డ్ ట్రంప్ అన్నారు. సోషల్ మీడియాను ఎరగా వాడి యువకులను ఐఎస్ ఊబిలోకి లాగుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. మనల్ని, మన దేశాన్ని నాశనం చేయాలనుకునే మిలిటెంట్లు ఇంటర్నెట్ వాడుతారన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఓ డిబెట్ కార్యక్రమానికి హారైన ఆయన ఈ విధంగా బదులిచ్చారు. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఇంటర్నెట్ మాధ్యమంగా వాడి ఐఎస్ గ్రూపులోకి చాలా మందిని రప్పించుకుందన్నారు. సామాన్య పౌరుల కంటే కూడా ఇస్లామిక్ మిలిటెంట్లు ఇంటర్నెట్ సేవల్ని బాగా వినియోగించుకుంటారని పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీ మేధావులు ఎలాగైనా శ్రమించి ఉగ్రసంస్థలు తమ సమాచారాన్ని కనిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను కట్టడి చేయాలని పిలుపునిచ్చారు. టెక్నాలజీని వాడి ఐఎస్ఎస్ గ్రూపు ఎప్పుడు, ఎక్కడ ఉంటుంది, వారు ఎటువంటి చర్యలకు పాల్పడనున్నారో అలాంటి విషయాలను మీరు ముందుగానే గుర్తించాలని డొనాల్డ్ ట్రంప్ సూచించారు. అయితే, రిపబ్లికన్ పార్టీకే చెందిన మరో అభ్యర్థి, ఓహియో గవర్నర్ జాన్ కసిక్ ఈ విషయాలను ఖండించారు. ఇంటర్నెట్ను తొలగించాలనుకోవడం మంచి నిర్ణయమా అని ప్రశ్నించారు. ఇంటర్నెట్ అంశంపై ట్రంప్ వ్యాఖ్యలను గమనిస్తే ఆయన సీరియస్ అభ్యర్థి కాదని సెనెటర్ రాండ్ పాల్ అభిప్రాయపడ్డారు. తనపై వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో.. ఐఎస్ఎస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఇరాక్, సిరియాలలో మాత్రమే ఇంటర్నెట్ సేవలు నిషేధించాలని మాత్రమే తాను వ్యాఖ్యానించినట్లు ట్రంప్ స్పష్టంచేశారు. -
టాక్సీ డబ్బులు అడిగిన భారతీయుడిపై దారుణం
లండన్: టాక్సీ డబ్బులు అడిగినందుకు భారత సంతతికి చెందిన ఓ టాక్సీ డ్రైవర్ ను ఇస్లామిక్ స్టేట్ సభ్యుడంటూ ఆరోపిస్తూ నలుగురు ప్రయాణికులు అతడిపై దాడికి దిగారు. గత వారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానిక న్యూస్ పేపర్ కథనం ప్రకారం... భారత్‌కు చెందిన కనక్ హిరానీ బ్రిటన్‌లో టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 4న కొందరు ప్రయాణికులు హిరానీ టాక్సీ ఎక్కారు. వేల్స్ లోని కార్డిఫ్ సిటీ నుంచి సమీపంలోని ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్లాలని సూచించారు. రెస్టారెంట్ వద్ద టాక్సీ ఆపమని ఇద్దరు వారికి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కోసం లోనికి వెళ్లారు. టాక్సీలో ఉన్న మరో ఇద్దరితో ఆలస్యం అవుతుందని, ఇప్పటికే మీటరుపై 20 పౌండ్లు ఎక్కువ అయిందని హిరానీ చెప్పాడు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. టాక్సీ డ్రైవర్‌కు మనీ ఇవ్వడం ఇష్టంలేని కారణంగా వారు అనవసర రాద్దాంతం చేశారు. మొదట తమ వద్ద డబ్బులున్నాయి ఏం పర్లేదు అన్నారనీ.. ఆ తర్వాత టాక్సీలో కూర్చున్న ఇద్దరు తనను తిట్టడం మొదలెట్టారన్నాడు. ఆ తర్వాత టాక్సీకి అడ్డంగా రోడ్డుపై ఉండి హిరానీని ఇబ్బంది పెట్టారు. ఏకంగా డ్రైవర్ నుంచి టాక్సీ లాక్కుని అతడ్ని గెంటేయాలని చూడటం గమనార్హం. నువ్వు ఐఎస్ఐఎస్ కి చెందిన ఉగ్రవాదివి కాదని నమ్మడం ఎలా.. రుజువు చేస్తావా అని టాక్సీ డబ్బులు ఎగ్గొట్టడానికి డ్రైవర్‌ను దబాయించారు. దాడి చేయాలని వారు ప్రయత్నించగా ఏం చేయాలో పాలుపోని డ్రైవర్ అలారమ్ ఆన్ చేయడంతో వారు అక్కడి నుంచి పారిపోయారని సౌత్ వేల్స్ పోలీసు అధికారి తెలిపారు. టాక్సీ మనీ పేమెంట్ నుంచి బయటపడటానికి జాతి అహంకార దాడులకు పాల్పడ్డ ఈ ఘటనలో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.