
దేశంలో ‘ఎమర్జెన్సీ’ కొనసాగుతున్నందున ‘హెబియస్ కార్పస్’ పిటిషన్‌ను కొద్దికాలం రద్దు చేస్తున్నట్లు 1976లో సుప్రీం కోర్టు ప్రకటించింది.
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ‘ఎమర్జెన్సీ’ కొనసాగుతున్నందున ‘హెబియస్ కార్పస్’ పిటిషన్‌ను కొద్దికాలం రద్దు చేస్తున్నట్లు 1976లో సుప్రీం కోర్టు ప్రకటించింది. చట్టం కింద అరెస్ట్ చేసిన వారిని కోర్టు ముందు హాజరు పర్చాల్సిందిగా కోరుతూ దాఖలు చేసే పిటిషన్ ‘హబియస్ కార్పస్’ పిటిషన్ అంటారన్న విషయం తెల్సిందే. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కొన్ని వందలాది మందిని నాడు ప్రభుత్వం అరెస్ట్ చేసి జైళ్లో పెట్టిన నేపథ్యంలో దాఖలైన హబియస్ కార్పస్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఈ పిటషన్ హక్కును రద్దు చేస్తున్నట్లు ఆసాధారణ తీర్పును వెలువరించింది. మాజీ ఐఏఎస్ అధికారి షా ఫాజల్ నిర్బంధంపై నాడు ఈ పిటిషన్ దాఖలయింది.
కశ్మీర్‌లో ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగం 370వ అధికరణను ఎత్తివేసిన నేపథ్యంలో నిలిపివేసిన మొబైల్, ఇంటర్నెట్ కమ్యూనికేషన్లను వెంటనే పునరుద్ధరించాల్సిందిగా కోరుతూ ‘కశ్మీర్ టైమ్స్’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధా భాసిన్ ఆగస్టు 16వ తేదీన దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కూడా సుప్రీం కోర్టు ఎమర్జెన్సీ కాలం నాటి లాంటి ప్రకటనే చేసింది. అక్కడ పరిస్థితి మెరగు పడడానికి మరింత సమయం కావాలని ప్రభుత్వం కోరుతున్నందున ‘కమ్యూనికేషన్ల పునరుద్ధరణ’పై మరికొంతకాలం నిరీక్షిద్దామని సుప్రీం చెప్పింది. వ్యక్తిగత స్వేచ్ఛ (ప్రైవసీ)కూడా ప్రాథమిక హక్కే అంటూ 2017లో కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు అదే వ్యక్తిగత స్వేచ్ఛకు నేడు భంగం కలిగితే ప్రభుత్వ పక్షాన మాట్లాడం ఆశ్చర్యంగా ఉంది. (చదవండి: కశ్మీర్‌లో కనిపించే నేటి పరిస్థితి ఇదీ!)