
ఇది మోదీ విజయం
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం వైపు దూసుకుపోవడంపై ఆ పార్టీ స్పందించింది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయమని బీజేపీ అభివర్ణించింది. మోదీ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని ఈ ఎన్నికల ద్వారా రుజువైందని ఆ పార్టీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ . శనివారం న్యూఢిల్లీలో వెల్లడించారు. ఇరు రాష్ట్రాలలో బీజేపీ తొలిసారిగా అధికారాని చేపడతామని షానవాజ్ విశ్వాసం వ్యక్తం చేశారు.