ఒకే వేదికపై ఆ ఇద్దరు! | Jaitley, Kejriwal To Share Stage At Mamata Banerjee's Business Summit | Sakshi
Sakshi News home page

ఒకే వేదికపై ఆ ఇద్దరు!

Published Thu, Jan 7 2016 9:11 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM

ఒకే వేదికపై ఆ ఇద్దరు!

ఒకే వేదికపై ఆ ఇద్దరు!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో నిర్వహించనున్న అంతర్జాతీయ వాణిజ్య సదస్సు అరుదైన రాజకీయ కలయికకు వేదిక కానుంది. శుక్ర, శనివారాల్లో జరుగనున్న ఈ సదస్సులో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఒకే వేదిక పంచుకోనున్నారు. శుక్రవారం జరుగనున్న ప్లీనరీ సదస్సులో మొదట జైట్లీ మాట్లాడనుండగా.. ఆ తర్వాత ఇద్దరు వక్తల అనంతరం కేజ్రీవాల్ ప్రసంగించనున్నారు.

ఢిల్లీ క్రికెట్ బోర్డు (డీడీసీఏ) వ్యవహారంలో జైట్లీ-కేజ్రీవాల్ ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ యుద్ధానికి తెరలేపిన సంగతి తెలిసిందే. జైట్లీ హయాంలో డీడీసీఏలో అనేక అక్రమాలు జరిగాయని కేజ్రీవాల్ ఆరోపిస్తే.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కేజ్రీవాల్‌పై జైట్లీ పరువునష్టం దావా వేశారు. ఉప్పు-నిప్పులా ఉన్న ఇద్దరు నేతలు ఒకే వేదికపై ప్రసంగించనుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మమత సర్కార్‌ వరుసగా రెండోసారి నిర్వహిస్తున్న ఈ సదస్సులో జైట్లీతోపాటు మోదీ ప్రభుత్వంలో కీలక మంత్రులైన నితిన్‌ గడ్కరీ, సురేశ్‌ప్రభు, పీయూష్ గోయల్‌ పాల్గొంటున్నారు. అలాగే భూటాన్ ప్రధాని షెరింగ్‌ తాబ్‌గే, బంగ్లాదేశ్‌ వాణిజ్యశాఖ మంత్రి తొఫైల్‌ అహ్మద్‌తోపాటు ముఖేశ్ అంబానీ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఈ సదస్సులో పాల్గొననున్నారని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement