బాబు, మోడీ తప్పు చేసినా జనసేన ప్రశ్నిస్తుంది: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం, బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తారనే ఆశాభావాన్ని జననేత అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. ఎన్ డీఏ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఓ టెలివిజన్ ఛానెల్ తో మాట్లాడుతూ.. ఒకవేళ చంద్రబాబు, నరేంద్రమోడీ తప్పు చేసినా జనసేన పార్టీ ప్రశ్నిస్తుంది అని అన్నారు.
చంద్రబాబు, మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరుకాకపోవచ్చని పవన్ కళ్యాణ్ తెలిపారు. త్వరలో జరిగే జీహెచ్ ఎంసీ ఎన్నికలపై దృష్టి పెడుతానని ఆయన అన్నారు. బీజేపీ టికెట్ పై పోటి చేస్తే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మద్దతిస్తానని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.