తమిళ అసెంబ్లీలో జయ చిత్రపటం | Jayalalithaa’s portrait unveiled in TN Assembly, | Sakshi
Sakshi News home page

తమిళ అసెంబ్లీలో జయ చిత్రపటం

Published Tue, Feb 13 2018 1:41 AM | Last Updated on Tue, Feb 13 2018 1:43 AM

Jayalalithaa’s portrait unveiled in TN Assembly,  - Sakshi

అసెంబ్లీలో జయ ఫొటో వద్ద నివాళులర్పిస్తున్న స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎం

సాక్షిప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో దివంగత సీఎం జయలలిత నిలువెత్తు చిత్రపటాన్ని అసెంబ్లీ స్పీకర్‌ ధనపాల్‌ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధి కోసం జయ  చేసిన కృషిని స్పీకర్‌ కొనియాడారు. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, డిప్యూటీ స్పీకర్‌ పొల్లాచ్చి జయరామన్, అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై జయకు నివాళులర్పించారు.

అసెంబ్లీ హాలులో ఇప్పటికే పెరియార్, అన్నాదురై సహా పదిమంది అగ్రనేతల చిత్రపటాలను గత ప్రభుత్వాలు ఏర్పాటుచేశాయి. కాగా, చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమాన్ని డీఎంకే, కాంగ్రెస్‌ బహిష్కరించాయి. అన్నాడీఎంకే తిరుగుబాటు నేత, ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఆస్తుల కేసులో జయ దోషిగా తేలినందున ఆమె చిత్రపటాన్ని అసెంబ్లీ నుంచి తొలగించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో డీఎంకే పిటిషన్‌ వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement