న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం ఉదయం వాయిదా పడి రాత్రి మళ్లీ మొదలైంది. ఓట్ల లెక్కింపు జరుగుతుండగా ఏబీవీపీ నేతలు కౌంటింగ్ కేంద్రంలోకి చొరబడి ఈవీఎంలు లాక్కునేందుకు ప్రయత్నించారనీ, అందుకే లెక్కింపు ప్రక్రియను వాయిదా వేసినట్లు ఎన్నికల నిర్వహణ విభాగం తెలిపింది. ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం గురించి తమకు ముందస్తు సమాచారం ఇవ్వనేలేదనీ, తమ ఏజెంట్ లేకుండానే బ్యాలెట్ పెట్టెల సీల్ తెరవడంతోపాటు ఆ తర్వాతా తమ ఏజెంట్లను లోపలికి అనుమతించలేదని ఆరోపించారు. శనివారం రాత్రికి ఓట్ల లెక్కింపు పునఃప్రారంభం కావడంతో ఆదివారానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment