Counting votes
-
Association of Democratic Reforms: ఈ వ్యత్యాసాలు ఎందుకు?
న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఎందుకుందో చెప్పాలని భారత ఎన్నికల సంఘాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) గురువారం డిమాండ్ చేసింది. ఓట్లలో వ్యత్యాసానికి కారణాలను వివరించాలని కోరింది. సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా 538 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడాలున్నాయని ఏడీఆర్ సోమవారం తమ నివేదికలో వెల్లడించిన విషయం తెలిసిందే. 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే.. 5,54,598 ఓట్లను తక్కువగా లెక్కించారని తెలిపింది. మరో 176 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకంటే 35,093 ఓట్లను అదనంగా లెక్కించారని పేర్కొంది. ఏడీఆర్ సోమవారం నివేదిక వెలువరించినప్పటికీ ఈసీ ఇప్పటిదాకా ఓట్లలో వ్యత్యాసంపై స్పందించలేదు. ఏపీలోనే అత్యధికం పోలైన, లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసం మొత్తం దేశంలో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా ఉంది. ఏపీలో 21 నియోజకవర్గాల్లో కలిపి మొత్తం పోలైన ఓట్ల కంటే 85,777 ఓట్లను తక్కువగా లెక్కించారు. అలాగే మరో నాలుగు నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే 3,722 ఓట్లను అధికంగా లెక్కించారు. ఇది అనుమానాలకు తావిస్తోంది. ఓట్లలో తేడా ఎలా వచి్చందో చెప్పాలని.. ఏడీఆర్ గురువారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధూలకు లేఖ రాసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ఓట్ల లెక్కింపులో వ్యత్యాసాలపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ వ్యత్యాసాలపై ఈసీ తక్షణం వివరణ ఇవ్వాలని, ఎన్నికల ప్రక్రియలో ప్రజా విశ్వాసం సడలకుండా చూడాలని కోరింది. -
అక్టోబర్ 30న బద్వేలు ఉపఎన్నిక
-
‘‘చంద్రగిరిలో చంద్రబాబు శంకరగిరి మాన్యాలు పట్టారు’’
సాక్షి, తాడేపల్లి: ‘‘ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ దూసుకుపోతుంది. ఇంత చక్కని ఫలితాలు అందించిన ప్రజలకు కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జనరంజక పాలన చేస్తున్నారు కాబట్టే ఇంత మంచి ఫలితాలు వస్తున్నాయి’’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘స్థానిక సంస్థలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మహాత్మా గాంధీ చెప్పినట్లు స్థానికంగా పరిపాలన జరగాలి. ఈ ఎన్నికలు సరైన సమయంలో జరగాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ గత ప్రభుత్వంలోనే గడువు ముగిసింది. రాజ్యాంగపరంగా ఎన్నికలు జరపాలి. చంద్రబాబు గెలవలేమని ఎన్నికలు పెట్టకుండా పారిపోయాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలు పెట్టాలని కృషి చేశారు. అప్పుడు ప్రారంభించిన ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది’’ అన్నారు. ‘‘ఈ లోపు చంద్రబాబు, ఆయనతో కలిసి కొన్ని దుష్ట శక్తులు ఎన్నో కుట్రలు చేశారు. అర్ధాంతరంగా వాయిదా వేయడం నుంచి ఎన్నికలు జరిగినా ఫలితాలను ప్రకటించకుండా చేశారు. అన్ని అవరోధాలు దాటుకుని ఈ రోజు ఫలితాలు వస్తున్నాయి. దీంతో మేము బహిష్కరించాం అని మాట్లాడుతున్నారు. పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో నువ్వు, నీ కొడుకు కాలికి బలపం కట్టుకుని తిరిగారు.. ఫలితాలు ఏమైనా మారాయా. కుప్పం కూడా కుప్పకూలి పోయింది... చంద్రగిరి శంకరగిరి మాన్యాలు పట్టింది. ఇక టీడీపీ మూసేయడానికి సిద్ధంగా ఉంది...తెలుసుకోలేకపోతే నీ ఖర్మ’’ అన్నారు అంబటి. ‘‘ఈ ఫలితాలు జగన్మోహన్రెడ్డి జనరంజక పాలన చేస్తున్నాడు కాబట్టే వస్తున్నాయి. ఇలాంటి చక్కని ఫలితాలను ఇస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు. ఏ ఎన్నికలైనా ఒకే ఫలితాలను ఇస్తున్నారు కుట్రలు కుతంత్రాలు తప్ప ప్రజల మధ్యకు వెళ్లి గెలవాలని చంద్రబాబుకి లేదు. ఆయన అధికారంలోకి వచ్చిందే కుట్రల వల్ల మమ్మల్ని 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించమని ప్రజలు అధికారం ఇచ్చారు. ఇప్పుడు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. కావాలంటే టీడీపీ మొత్తం రాజీనామా చేయండి... మీ నియోజకవర్గాల్లో పోటీ చేసి తేల్చుకుందాం’’ అంటూ అంబటి సవాలు విసిరారు. చదవండి: పూర్తి ప్రజామోదంతో మెరుగైన పరిపాలన చేస్తాం: మంత్రి కురసాల -
నేడు హుజూర్నగర్ ఓట్ల లెక్కింపు
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: హుజూర్నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధమైంది. సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్లో గురువారం ఉదయం 8 నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. ఈ ఎన్నికలో మొత్తం 28 మంది పోటీ పడ్డారు. నియోజకవర్గ వ్యాప్తంగా 7 మండలాల్లో 302 పోలింగ్ కేంద్రాల్లో 2,00,754 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 14 టేబుళ్లపై 22 రౌండ్లలో ఈ ఓట్ల లెక్కిపు పూర్తిచేస్తారు. ఒక్కో రౌండ్లో సుమారు 9 వేలపై చిలుకు ఓట్లను లెక్కిస్తారు. బుధవారం కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల పరిశీలకుడు సచీంద్రప్రతాప్ సింగ్, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దుగ్యాల అమయ్‌కుమార్ పరిశీలించారు. నేరేడుచర్ల మండలం నుంచి ప్రారంభం.. నేరేడుచర్ల మండలం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై వరుసగా పాలకీడు, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, హుజూర్నగర్ మండలం, పట్టణం, గరిడేపల్లి మండలంలోని లెక్కింపుతో పూర్తవుతుంది. లెక్కింపు అంతా పూర్తయ్యాక వీవీప్యాట్ స్లిప్పులు లెక్కిస్తారు. 302 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి వరుసగా 1వ నంబర్ నుంచి 302 వరకు అంకెలను ఒక్కో స్లిప్పుపై వేస్తారు. వీటిలో 5 స్లిప్పులు డ్రా తీస్తారు. ఈ డ్రాలో వచ్చిన పోలింగ్ కేంద్రం స్లిప్పు ఆధారంగా ఆ పోలింగ్ బూత్‌లోని వీవీప్యాట్ స్లిప్పులు ఏ పార్టీకి ఎన్ని పడ్డాయో లెక్కిస్తారు. ఈ స్లిప్పులను.. ఇదే పోలింగ్ బూత్‌లోని ఈవీఎంలలో ఆయా పార్టీకి పడిన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరి చూస్తారు. ఇది పూర్తయ్యాక అభ్యర్థులు ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే రిటర్నింగ్ అధికారి గెలిచిన అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తారు. మధ్యా హ్నం 12 గంటల వరకు తుది ఫలితం వెలువడుతుందని అధికారులు వెల్లడించాయి. ఇక ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఎవరు విజయం సాధిస్తారన్న దానిపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. ఎక్కువగా మెజార్టీపైనే బెట్టింగ్‌లు పెట్టినట్లు సమాచారం. -
వీవీ ప్యాట్ స్లిప్పుల కలకలం
సాక్షి, దర్శి : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వీవీ ప్యాట్ స్లిప్‌లు ప్రత్యక్షమయ్యాయంటూ కలకలం రేగింది. కౌంటింగ్‌కు నాలుగు రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఈ స్లిప్పులు ప్రత్యక్షమయ్యాయని పుకార్లు రావడంతో ఎస్సై శశి కుమార్ ఆ కళాశాలకు వెళ్లి పరిశీలించారు. వీవీ ప్యాట్ స్లిప్పులు మాత్రం దొరకలేదు. వాటిని పరిశీలిస్తే వీవీ ప్యాట్ ఆన్ చేసినప్పుడు సెన్సార్, బ్యాటరీలు పనితనం గురించి తెలియజేసే స్లిప్‌లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో వీవీ ప్యాట్లు భద్రపరిచి.. రాజకీయ పార్టీల నాయకులకు అవగాహన కల్పించిన ప్రాంతంలో ఉన్న చెత్త కుప్ప పక్కన ఈ స్లిప్పులు కనిపించాయి. ఆ ప్రాంతంలోనే ఎన్నికలు కూడా నిర్వహించారు. వీవీ ప్యాట్ చెక్ చేసినప్పుడు లేదా అన్ చేసినప్పుడు 7 స్లిప్పులు బయటకు వస్తాయి. ఆ 7 స్లిప్‌లు ఈవీఎం çపని చేసే కండిషను గురించి తెలియజేస్తాయి. 7స్లిప్‌లు బయటకు రాక పోతే ఆ ఈవీఎం పని చేయనట్లు నిర్ధారణ అవుతుంది. అక్కడ ఉన్న స్లిప్‌లను పరిశీలిస్తే ఈ వీఎంలు పని చేస్తున్నాయా లేదా తెలిపే బ్యాటరీ చెకప్, సెన్సార్, ఎల్ఈడీ రిపోర్ట్ స్లిప్‌లుగా అనుమానం వ్యక్తం అవుతోంది. అక్కడ విలేకరులకు దొరికిన స్లిప్‌లను ఎస్ఐ శశికుమార్ తీసుకుని పరిశీలించారు. ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు. అయితే వీవీ ప్యాట్‌లో వచ్చే స్లిప్‌లపై పార్టీలకు చెందిన గుర్తులుంటాయని కొందరు చెప్తున్నారు. ఆ స్లిప్‌లపై అలాంటి గుర్తులు లేవు. ఆంగ్లంలో టైప్ అయిన అక్షరాలు మాత్రమే ఉన్నాయి. దీంతో అవి వీవీ ప్యాట్ స్లిప్‌లు కావని, వాటి సామర్థ్యం తెలిపే స్లిప్పులు మాత్రమే అని తెలుస్తోంది. ఏదేమైనా పూర్తి స్థాయిలో విచారణ జరిగితేనే అసలు విషయం బయటకు వస్తుంది. ఆర్వో కృష్ణవేణిని వివరణ కోరేందుకు సంప్రదించగా కార్యలయంలో లేరు. ఫోన్ ద్వారా సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. -
ఓట్ల లెక్కింపు పారదర్శకంగా ఉండాలి
సాక్షి, ఒంగోలు అర్బన్: ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్, ఎన్నికల అధికారి వినయ్‌చంద్ మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. స్థానిక ఏ1 కన్వెన్షన్ హాలులో కౌంటింగ్ ప్రక్రియపై మైక్రో అబ్జర్వర్లు, నోడల్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు శనివారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను అనుసరించి విధివిధానాలను పూర్తిగా అవగాహన చేసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ప్రతిది ప్రత్యేకమైన నిర్వహణ క్రమం ఉంటుందని, వాటిని అనుసరించాలన్నారు. ప్రతి టేబుల్లో ప్రతి ఓటు ప్రాధాన్యం కలిగి ఉందనేది తెలుపుతూ ప్రతి రైండు టేబుల్ వారీగా అభ్యర్థుల వారీగా కంట్రోలు యూనిట్లో పోలైన ఓట్లు జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. నోటా కూడా రికార్డు చేయాలని సూచించారు. కంట్రోలు యూనిట్లో నమోదైన ఓట్లను జాగ్రత్తగా నమోదు చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ పేపర్లు, ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ వ్యవస్థ ద్వారా వచ్చిన వాటిని లెక్కిస్తామన్నారు. అనంతరం ఈవీఎంలలోని ఓట్లను లెక్కించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి పోస్టల్ బ్యాలెట్లు లెక్కించేందుకు రెండు టేబుళ్లను ఏర్పాటు చేశామని, ప్రతి రౌండుకు 500 పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు సంబంధించి గిద్దలూరు అసెంబ్లీకి 4 టేబుళ్లు, ఒంగోలు పార్లమెంట్ స్థానానికి 4 టేబుళ్లు, బాపట్ల పార్లమెంట్‌కు 4 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మైక్రో అబ్జర్వర్లు తమకు కేటాయించిన ప్రొఫార్మాలో పోలైన ఓట్లు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు సూపర్వైజర్లు కౌంటింగ్ అసిస్టెంట్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రత్యేక కలెక్టర్ చంద్రమౌళి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపులో మైక్రో అబ్జర్వర్లు నూరుశాతం అప్రమత్తంగా ఉండి పోలైన ఓట్లను జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. ప్రతిస్థాయిలో కౌంటింగ్ సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు డేటా తేడా లేకుండా సరిగా ఉండాలన్నారు. దీనిలో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఓట్ల లెక్కింపు ప్రక్రియపై వివరించారు. శిక్షణలో సంయుక్త కలెక్టర్ నాగలక్ష్మి, ఎల్డీఎం వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
గల్లంతైన ఓట్లు 2,05,174
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏటా 18 సంవత్సరాలు నిండిన యువ ఓటర్లు పెరుగుతున్న నేపథ్యంలో ఐదేళ్లకోసారి ఆయా నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య పెరగాలి. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 2014 ఏప్రిల్‌లో ఉమ్మడి జిల్లాలో ఉన్న ఓటర్ల కన్నా 2018 సెప్టెంబర్ నాటికి ఓటర్ల సంఖ్య ఏకంగా 2.05 లక్షలకు తగ్గింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 19,59,661 మంది ఓటర్లు ఉండగా, 2018 సెప్టెంబర్ నాటికి ఈ సంఖ్య 17,54,486 మందికి తగ్గింది. నాలుగేళ్లలో కేవలం మూడు నియోజకవర్గాల్లో మాత్రమే గతంలో కన్నా 12,679 మంది ఓటర్లు పెరిగారు. తద్వారా ఉమ్మడి జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 17,67,165గా తేలింది. ఓటుహక్కుపై అవగాహన పెంచేందుకు ఓవైపు కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలు నాలుగేళ్లలో ఎంతమేర సఫలీకృతమయ్యాయో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని పరిస్థితిని చూస్తే తేటతెల్లం అవుతోంది. ఒక్క మంచిర్యాలలోనే 92,337 ఓట్లు గల్లంతు రాష్ట్రంలో బహుశా ఎక్కడా లేని విధంగా మంచిర్యాలలో 2014 ఎన్నికల నుంచి ఇప్పటికి ఏకంగా 92,337 ఓట్లు తగ్గాయి. ఈ నియోజకవర్గంలో 2014 సంవత్సరంలో 2,38,423 ఓటర్లు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 1,46,086కు తగ్గింది. మంచిర్యాల పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారీగా ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని జాబితాను పరిశీలిస్తే అర్థమవుతోంది. మంచిర్యాల తరువాత అత్యధికంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో 49,224 మంది ఓటర్లు తగ్గగా. ఆ తరువాత నిర్మల్‌లో 23,582 ఓట్లు తగ్గాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో పట్టణ ఓటర్లను గణనీయంగా ఏరివేసినట్లు స్పష్టమవుతోంది. ముథోల్‌లో 15,074, సిర్పూర్లో 11,430 , ఖానాపూర్‌లో 7,720, బెల్లంపల్లిలో 5,807 ఓట్లు తగ్గడం గమనార్హం. ఆసిఫాబాద్‌లో 10,271 ఓట్లు నాలుగేళ్లలో ఎక్కువయ్యాయి. తరువాత చెన్నూర్‌లో 1897, బోథ్‌లో 511 మాత్రమే గత ఎన్నికల కన్నా పెరిగిన ఓటర్లు. తొలగింపుల వెనుక ప్రజాప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాలను ఉమ్మడి ఆదిలాబాద్‌లో నాలుగుసార్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇష్టానుసారంగా ఓటర్లను ఏరివేయడంతోనే ఓటర్ల సంఖ్య తగ్గిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో చనిపోయిన ఓటర్లతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని జాబితా నుంచి తొలగించడం జరుగుతుంది. కానీ అనేక నియోజకవర్గాల్లో ఉద్దేశపూర్వకంగానే ఓటర్ల సంఖ్యను తగ్గించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వార్డు సభ్యులుగా పోటీ చేసినవారు, స్థానిక ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారి ఓట్లు కూడా ఓటర్ల సవరణల్లో గల్లంతైనట్లు సమాచారం. ఓటర్ల సవరణ కార్యక్రమం నిర్వహించినప్పుడు అభ్యంతరాలు వచ్చిన ఓట్లను తొలగించి, కొత్తగా నమోదు చేసుకోవడం జరుగుతుంది. గ్రామాలతో పాటు పట్టణాల్లో కూడా వార్డు సభ్యులు, సర్పంచులు, కౌన్సిలర్లు ఈ ఓటర్ల జాబితా సవరణను ప్రభావితం చేస్తుండడంతో అర్హులైన వారి పేర్లు కూడా చాలావరకు గల్లంతవుతున్నాయి. వీఆర్వో, గ్రామ కార్యదర్శుల నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే గ్రామ సర్పంచి గానీ, ఎంపీటీసీ గానీ ఈ ఓటర్ల జాబితాలపై పెత్తనం చలాయించడం సర్వసాధారణమైంది. గ్రామాల్లో తమకు వ్యతిరేక వర్గంగా భావించే వారి ఓట్లను మూకుమ్మడిగా తొలగించడం వల్లనే ఈ పరిస్థితి ఎదురవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇచ్చిన గడువులోగా వచ్చిన అభ్యంతరాల మేరకు ఓటర్లను తొలగించడం, కొత్త ఓటర్లను నమోదు చేయకపోవడంతో ప్రతీ సవరణ సమయంలో ఓటర్ల సంఖ్య తగ్గుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా గల్లంతైన ఓట్ల వివరాలు మళ్లీ ఎన్నికలు వచ్చేంత వరకు సంబంధిత వ్యక్తులకు తెలియని పరిస్థితి తలెత్తుతోంది. జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యమే.... 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటేసే హక్కు లభిస్తుంది. వీరిని ఓటర్లుగా నమోదు చేసేందుకు ఓటర్ల సవరణలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అలాగే ఆన్లైన్లో ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా 18 ఏళ్లు నిండిన వారు గానీ, ఓటు హక్కు లేని ఎవరైనా ఫారం–6ని పూర్తి చేసి కొత్తగా ఓటర్లుగా నమోదు కావచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే వీఆర్వో ద్వారా విచారణ జరిపి, ధ్రువీకరణ పత్రాలను సరిచూసి కొత్త ఓటర్లుగా నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ కూడా గ్రామీణ స్థాయిలో సక్రమంగా జరగకపోవడం వల్ల కూడా కొత్త ఓటర్ల సంఖ్య తగ్గిపోతుంది. అదే సమయంలో ఉన్న ఓటర్లు తొలగించబడుతున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత ఉమ్మడి జిల్లాలో ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి అంతర్గత బదిలీలపై వెళ్లిన వారు కూడా ఫారం–6 ద్వారా మార్పులు చేసుకోవచ్చు. కానీ నాలుగేళ్లలో మూడు నియోజకవర్గాలలో మాత్రమే ఓటర్ల సంఖ్య పెరిగినట్లు తాజా ఓటర్ల జాబితా ద్వారా తెలుస్తోంది. 25 వరకు ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టింది. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన వారు గానీ, నియోజకవర్గాల నుంచి ఈనెల 25వ తేదీ వరకు తిరిగి ఓటర్లుగా నమోదు అయ్యేందుకు అవకాశం కల్పించారు. 2018 జనవరి 1 వరకు 18 సంవత్సరాలు నిండిన వారంతా ఇందుకు అర్హులే. ఆన్లైన్ ద్వారా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. -
జేఎన్‌యూ ఓట్ల లెక్కింపు వాయిదా
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం ఉదయం వాయిదా పడి రాత్రి మళ్లీ మొదలైంది. ఓట్ల లెక్కింపు జరుగుతుండగా ఏబీవీపీ నేతలు కౌంటింగ్ కేంద్రంలోకి చొరబడి ఈవీఎంలు లాక్కునేందుకు ప్రయత్నించారనీ, అందుకే లెక్కింపు ప్రక్రియను వాయిదా వేసినట్లు ఎన్నికల నిర్వహణ విభాగం తెలిపింది. ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం గురించి తమకు ముందస్తు సమాచారం ఇవ్వనేలేదనీ, తమ ఏజెంట్ లేకుండానే బ్యాలెట్ పెట్టెల సీల్ తెరవడంతోపాటు ఆ తర్వాతా తమ ఏజెంట్లను లోపలికి అనుమతించలేదని ఆరోపించారు. శనివారం రాత్రికి ఓట్ల లెక్కింపు పునఃప్రారంభం కావడంతో ఆదివారానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. -
భారీ భద్రత మధ్య కౌంటింగ్
న్యూఢిల్లీ: నగరంలో శుక్రవారం జరగనున్న ఎనిమిది కోట్ల 20 లక్షల ఓట్ల కౌంటింగ్ భారీ భద్రత మధ్య జరగనుంది. ఏడు వేల మంది నగర పోలీసులతో పాటు ఏడు పారామిలిటరీ బలగాలు భద్రతా విధులు నిర్వహిస్తాయని ఎన్నికల అధికారి ఒకరు బుధవారం తెలిపారు. ఏప్రిల్ పదిన ఎన్నికలు జరిగినప్పటి నుంచి మొత్తం రెండు వేల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం)లను స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపరిచామని చెప్పారు. నగరంలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో పోటీచేసిన 150 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్న ఓట్ల లెక్కింపులో పది వేల మంది అధికారులు పాల్గొంటారని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల లోపల పారామిలిటరీ బలగాలు, అవతల నగర పోలీసులు పహరా కాస్తారన్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. 18 ఏళ్లు నిండిన పరిపక్వత కలిగిన వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించాలని రాజకీయ పార్టీలను ఇప్పటికే ఈసీ కోరిందన్నారు. అశోక్ విహార్‌లోని అర్యభట్ట పాల్టెక్నిక్, నంద్ నగరిలోని ఐటీఐ, కామన్వెల్త్ గేమ్స్ విలేజ్, గోలే మార్కెట్లోని ఎన్పీ బెంగాలీ గర్ల్స్ సీనియర్ సెకండరీ స్కూల్, ఢిల్లీ టెక్నాలాజికల్ యూనివర్సిటీ, ద్వారకాలోని ఇంటిగ్రేటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జిజాభాయ్ ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఈ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఆయన తెలిపారు. -
ఓట్ల లెక్కింపునకు రెడీ
జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్ : స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపును ఈనెల 13న చేపట్టడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మండలాల వారీగా సిబ్బందిని నియమించి ఓట్ల లెక్కింపుపై శిక్షణ కూడా ఇచ్చారు. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీసీటీ ఎన్నికలు రెండు విడతల్లో ఏప్రిల్ 6వ తేదిన నాగర్‌కర్నూల్ ఎంపీ పరిధిలోని 35 మండలాల్లో, మహబూబ్‌నగర్ పరిధిలోని 29 మండలాల్లో జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 78 శాతం పోలింగ్ నమోదుకాగా 64 జెడ్పీటీసీలకు 402 మంది, 982 ఎంపీటీసీ స్థానాలకు 3,498 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యం ఈనెల 13న బహిర్గంతం కానుంది. విధుల్లో 3,048 మంది సిబ్బంది ఈనెల 13వ తేదీన నిర్వహించే ఓట్ల లెక్కింపునకు అధికారులు మూడు విభాగాలుగా సిబ్బందిని విభజించి 3048 మందిని ఎంపిక చేశారు. వీరికి ఆయా మండలాల్లో లెక్కింపుపై శిక్షణ కూడా ఇచ్చారు. వారిలో 615 సూపర్వైజర్లు, 1683 కౌంటింగ్ అసిస్టెంట్లు, 750 నాల్గో తరగతి ఉద్యోగులను ఎంపిక చేశారు. అలాగే 606 టేబుళ్లను సిద్ధం చేశారు. ప్రతి టేబుల్‌కు మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు చేస్తారు. జిల్లాలో అధికంగా అడ్డాకుల మండలానికి 15 టేబుళ్లను కేటాయించారు. లెక్కింపు ఇలా.. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఓట్ల లెక్కింపు కోసం ఆరు కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ముందుగా ఆయా గ్రామాల నుంచి ఇచ్చిన బ్యాలెట్ బాక్సులను అభ్యర్థులకు చెందిన ఏజెంట్ల సమక్షంలో బ్యాక్సు సీల్‌ను తీస్తారు. ఇలా తీసిన బ్యాక్సుల్లోని ఓట్లను ఒక కుప్పగా వేసి అందులోంచి జెడ్పీటీసీకి కేటాయించిన తెల్లరంగు బ్యాలెట్, ఎంపీటీసీకి కేటాయించిన గులాజీ రంగు బ్యాలెట్లను వేరు చేస్తారు. వేరు చేసిన బ్యాలెట్ పేపర్లను ఆయా గుర్తులతో ముందుగానే సిద్ధం చేసిన ట్రేలల్లో వేస్తారు. ఇలా వేరు చేయడానికి సుమారు 2 గంటల సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. పూర్తి స్థాయి లెక్కింపు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కావచ్చు. ప్రతి ఎంపీటీసీ స్థానం లెక్కింపు మూడు రౌండ్లుగా జరుగుతుంది. ఒక్కో రౌండ్‌కు సుమారు వెయ్యి ఓట్లను లెక్క బె డుతారు. ప్రతి గంటలకు ఒక్క సారి ఓట్ల లెక్కింపు లెక్కను ఏజెంట్లకు, మీడియాకు సమాచారం అందిస్తారు. మధ్యాహ్నం 1 గంటల వరకు ఎంపీటీసీల లెక్కింపు పూర్తవుతుంది. జెడ్పీటీసీల లెక్కింపు రాత్రి వరకు పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 25 ఓట్లను ఒక్క బెండల్గా కట్టి ఓట్లను లెక్క పెడతారు. ఇలా చేయడం వల్ల లెక్కింపు సులువుగా అవ్వడమే కాకుండా త్వరగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. బాక్సులు స్ట్రాంగ్ రూముల్లో భద్రం జిల్లాలోని ఆరు కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూముల్లో బాక్సులు భద్రంగా ఉన్నాయి. నా గర్‌కర్నూల్ డివిజన్ పరిధిలోని మండలాల బ్యాలెట్ బాక్కులు నాగర్‌కర్నూల్‌లోని నవోదయ జూనియర్ కళాశాలలో, నారాయణపేట్ పరిధిలోని మండలాల్లోని బాక్కులు నారాయణపేట శ్రీదత్త కళాశాలలో, వనపర్తి పరిధిలోని బాక్సు లు కేడీఆర్ కాలేజీలో, గద్వాల పరిధిలోని బాక్సులు గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని బాక్కులు సీబీఎం డిగ్రీ కాలేజీ లో, మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలోని బాక్సులు ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కా లేజీలో భద్రంగా ఉన్నాయి. కౌంటింగ్‌రోజు ఇటు అధికారులు అటు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసు బలగాలుంటాయి.