నగరంలో శుక్రవారం జరగనున్న ఎనిమిది కోట్ల 20 లక్షల ఓట్ల కౌంటింగ్ భారీ భద్రత మధ్య జరగనుంది. ఏడు వేల మంది నగర పోలీసులతో పాటు ఏడు పారామిలిటరీ బలగాలు
న్యూఢిల్లీ: నగరంలో శుక్రవారం జరగనున్న ఎనిమిది కోట్ల 20 లక్షల ఓట్ల కౌంటింగ్ భారీ భద్రత మధ్య జరగనుంది. ఏడు వేల మంది నగర పోలీసులతో పాటు ఏడు పారామిలిటరీ బలగాలు భద్రతా విధులు నిర్వహిస్తాయని ఎన్నికల అధికారి ఒకరు బుధవారం తెలిపారు. ఏప్రిల్ పదిన ఎన్నికలు జరిగినప్పటి నుంచి మొత్తం రెండు వేల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం)లను స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపరిచామని చెప్పారు. నగరంలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో పోటీచేసిన 150 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్న ఓట్ల లెక్కింపులో పది వేల మంది అధికారులు పాల్గొంటారని తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాల లోపల పారామిలిటరీ బలగాలు, అవతల నగర పోలీసులు పహరా కాస్తారన్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. 18 ఏళ్లు నిండిన పరిపక్వత కలిగిన వారిని కౌంటింగ్ ఏజెంట్‌లుగా నియమించాలని రాజకీయ పార్టీలను ఇప్పటికే ఈసీ కోరిందన్నారు. అశోక్ విహార్‌లోని అర్యభట్ట పాల్‌టెక్నిక్, నంద్ నగరిలోని ఐటీఐ, కామన్వెల్త్ గేమ్స్ విలేజ్, గోలే మార్కెట్‌లోని ఎన్‌పీ బెంగాలీ గర్ల్స్ సీనియర్ సెకండరీ స్కూల్, ఢిల్లీ టెక్నాలాజికల్ యూనివర్సిటీ, ద్వారకాలోని ఇంటిగ్రేటెడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జిజాభాయ్ ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఆయన తెలిపారు.