
కాజోల్ గురువారం హుబ్లీలోని సిద్ధరూఢ మఠాన్ని సందర్శించి పూజలు చేస్తున్న దృశ్యం
సాక్షి, బళ్లారి: కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న సిద్ధారూఢ మఠాన్ని బాలీవుడ్ నటి కాజోల్ సందర్శించారు. ఆమె గురువారం ప్రత్యేక విమానంలో హుబ్బళ్లికి విచ్చేశారు. హుబ్బళ్లిలోని సిద్ధారూఢ మఠంలో కుటుంబ సభ్యులతో కలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్ధారూఢ సమాధిని దర్శించుకున్న అనంతరం ధ్యానం చేశారు. తల్లి తనూజా ముఖర్జీ, కుమారుడు యోగి, సోదరి తనీషా, కుటుంబ సభ్యులు అభిషేకం చేశారు. చిన్నప్పటి నుంచి ఆమె సిద్ధారూఢ భక్తురాలు కావడం విశేషం.
సమాధికి హారతిస్తున్న కాజోల్, కుటుంబసభ్యులు