
సాక్షి, తిరువనంతపురం : నిర్ధారణ చేసుకోకుండా మన నేతలు చేస్తున్న తప్పిదాల్లో ఇప్పుడు మరొకటి జత చేరింది. కేరళ విద్యుత్ శాఖ మంత్రి ఎంఎం మణి తన సోషల్ మీడియాల్లో పోస్ట్ చేసిన ఫోటోతో విమర్శల పాలయ్యారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పేరిట పొరపాటున కొరియాకు చెందిన ఫోటోను గురువారం ఆయన షేర్ చేశారు.
వాయానాద్‌లో ఉన్న బాణసుర సాగర్ ప్రాజెక్టులో కేరళ ప్రభుత్వం నీటిపై తేలే సోలార్ ప్లాంట్ నిర్మాణం చేపట్టింది. ఇది పూర్తయితే దేశంలోనే ఇది పెద్దదిగా గుర్తింపు పొందుతుంది. నవంబర్ 1న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ఇంతలో ప్రాజెక్టు పూర్తయ్యిందంటూ ఓ ఫోటోను తన అఫీషియల్ ఫేస్‌బుక్, ట్విట్టర్(బ్లూటిక్ మార్క్ లేదు) లోపోస్ట్ చేశాడు.
అయితే గూగుల్ ఇమేజ్‌లో అది దక్షిణ కొరియాలోని ఓటె-జిప్యాంగ్ రిజర్వాయర్‌లో ఉన్న ప్రాజెక్టుదని తేలింది. ఫేక్ న్యూస్‌లను వెలుగులోకి తెచ్చే ఎస్‌ఎం హోక్స్ స్లెయర్ అనే వెబ్‌సైట్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో తన తప్పును గమనించి మంత్రి ఆ ట్వీట్, పోస్ట్ డిలీట్ చేసినప్పటికీ అప్పటికే అవి వైరల్ అయిపోయాయి. మంత్రిని ఏకీపడేస్తూ పోస్టుల మీద పోస్టులు పెట్టేస్తున్నారు. గొప్పలకు పోయి మంత్రి తొందరపడి చేసిన తప్పిందంతో ఆయనకు ఇలా తిప్పలు తెచ్చిపెట్టిందన్న మాట.
Comments
Please login to add a commentAdd a comment