ఎయిర్ పోర్ట్లో కిలో బంగారం పట్టివేత | Kerala was detained at the airport due to gold smuggling | Sakshi
Sakshi News home page

ఎయిర్ పోర్ట్లో కిలో బంగారం పట్టివేత

Published Sat, Dec 19 2015 10:59 AM | Last Updated on Thu, Oct 4 2018 8:29 PM

Kerala was detained at the airport due to gold smuggling

చెన్నై: లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని చెన్నై ఎయిర్ పోర్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. అధికారుల వివరాల ప్రకారం... దుబాయ్ నుంచి వచ్చిన ఓ విమానంలో కేరళకు చెందిన ప్రయాణికుడు అష్రాఫ్ శనివారం ఉదయం చెన్నై విమానాశ్రయంలో దిగాడు. తన వద్ద ఉన్న మ్యూజిక్ సిస్టమ్లో ఒక కిలో బంగారాన్ని దాచి ఉంచి అక్రమంగా రవాణా చేస్తున్నాడు.

కస్టమ్స్ అధికారులు విషయాన్ని గ్రహించి కేరళ ప్రయాణికుడ్ని తనిఖీ చేసి అతడ్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.25 లక్షల విలువ చేసే కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement