gold Recovered
-
చోరీలు చేసి.. జల్సాగా జీవిస్తూ..
కోవూరు: వివిధ చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న కట్టా రాము అనే వ్యక్తిని కోవూరు ఎస్సై చింతం కృష్ణారెడ్డి శుక్రవారం అరెస్ట్ చేశారని సీఐ జీఎల్ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2019 సంవత్సరం జూలై 23వ తేదీన కోవూరు పట్టణంలో నాలుగు గృహాల్లోకి చొరబడి బంగారు వస్తువులు, నగదు చోరీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో నిందితుడు మండలంలోని స్టౌ బీడీ కాలనీచెందిన కట్టా రాము అని నిర్ధారించారు. అతనిపై నిఘా ఉంచారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయగా రాము తెలంగాణలోని కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ఫినాయిల్ విక్రయిస్తూ చెడు వ్యసనాలకు బానిసైయ్యాడు. ఈ నేపథ్యంలో అతను చోరీలకు పాల్పడుతూ జల్సాగా జీవించసాగాడు. ఓ కేసులో జగిత్యాలలోని కోరట్ల పోలీసులు రామును అరెస్ట్ చేశారు. అక్కడినుంచి విడుదలై కోవూరు ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. నిందితుడి నుంచి రూ.2.70 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. రామును పట్టుకునేందుకు కృషిచేసిన ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ ఇస్మాయిల్, జబీవుల్లా, వెంకటేశ్వర్లు, ఎస్.వెంకటేశ్వర్లు, ఎస్కే అయాజ్‌లను సీఐ అభినందించారు. వారికి ఎస్పీ ద్వారా రివార్డులు అందజేయనున్నట్లుగా వెల్లడించారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ రాఘవరెడ్డి పర్యవేక్షణలో నేరస్తుడిని పట్టుకుని సొత్తు రికవరీ చేశామని సీఐ తెలిపారు. -
ఎట్టకేలకు గజదొంగ అరెస్ట్
ఖమ్మంక్రైం : తాళం వేసి ఉన్న ఇళ్లనే అతడు లక్ష్యంగా చేసుకొంటాడు. అంతే తన వద్ద ఉన్న వస్తువులతో చాకచక్యంగా తాళాలు పగులగొట్టి అందినకాడికి దోచుకుంటాడు. 6 నెలల పాటు దొంగతనాల జోలికి వెళ్లకుండా దొంగిలించిన సొత్తుతో జల్సాలు చేస్తూ తిరుగుతాడు.. ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌తో పాటు హైదరాబాద్ ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఓ గజ దొంగను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి సుమారు రూ.12లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం సీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ తఫ్సీర్ ఇక్బాల్ వివరాలు వెల్లడించారు. సిద్దిపేటకు చెందిన మనిగండ్ల విజయ్‌కుమార్ కూలీపనుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి అక్కడ చింతల్‌లోని భగత్‌సింగ్‌నగర్‌లో జీవిస్తూ విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడ్డాడు. జల్సాలకు డబ్బు సంపాదించేందుకు దొంగతనాలను మార్గంగా ఎంచుకొన్నాడు. దీనికితోడు మహిళలతో వివాహేతర సంబంధాలు ఏర్పరచుకొన్నాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా తాళం పగులగొట్టి చోరీలు చేసేవాడు. హైదరాబాద్‌లోని పరిసర ప్రాంతాల్లో 34 చోరీలు చేశాడు. వాటిలో 19 రాత్రి దొంగతనా లు, 13 పగటి దొంగతనాలు, 12 సాధారణ దొం గతనాలు చేసి జైలు శిక్ష సైతం అనుభవించాడు. ఖమ్మం వచ్చి.. కొత్తగూడెంలో బస్టాండ్ ఎదురుగా ఓ గది అద్దెకు తీసుకొని అక్కడ నుంచి ప్రతిరోజూ ఖమ్మం నగరానికి వచ్చి దొంగతనాలు చేసి వెళ్లిపోతూ ఉండేవాడు. ఒక్కఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఆరు, ఖమ్మం వన్‌టౌన్‌లో ఒకటి, ఖానా పురం హవేలిలో ఒకటి, సత్తుపల్లి, చుంచుపల్లి, కూసుమంచి, ఖమ్మం త్రీటౌన్ పరిధిలో ఒక్కొక్కటి చొప్పున చోరీలు చేశాడు. ఇలా చిక్కాడు.. వరుసగా చోరీలకు పాల్పడుతున్న ఈ వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు తిరుగుతున్నా వారికి దొరకకుండా చోరీలకు పాల్పడే వాడు. వేలిముద్రల ఆధారంగా విజయ్‌కుమార్ ను గుర్తించిన సీసీఎస్ పోలీçసులు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా వ్యవహారం బయటపడింది. అతని వద్ద రూ.12 లక్షల సొత్తు స్వాధీనం చేసుకొన్నారు. నెల గడువులోనే.. నెల గడువులోనే సీసీఎస్ పోలీసులు రెండు చోరీ కేసులను ఛేదించటం పట్ల సీపీతఫ్సీర్ ఇక్బాల్ సీసీఎస్ పోలీసులను అభినందించారు. గతంలో సీసీఎస్ పోలీస్‌స్టేషన్ సిబ్బందికి సరైన గుర్తింపు లేదని విమర్శలు వినపడ్డాయి. ప్రస్తుతం అడిషనల్ డీసీపీ సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఏసీపీ ఈశ్వరయ్య, సీఐ కరుణాకర్ తమ సిబ్బందితో టీమ్‌వర్క్ చేస్తూ గత నెల అంతర్ రాష్ట్ర దొంగ లను పట్టుకొన్న సీసీఎస్ పోలీసులు నెల తిరగకముందే మరో దొంగను పట్టుకోవడం విశేషం. సిబ్బందికి రివార్డులు.. ఈ కేసును ఛేదించిన సీసీఎస్ సిబ్బంది సీఐ కరుణాకర్, ఏఎస్ఐ లింగయ్య, సిబ్బంది సాధిక్, డి. డానియల్, సీహెచ్ శ్రీనివాసరావు, ఎస్ రాజ్‌కుమార్, క్లూస్‌టీమ్ సిబ్బంది జమలయ్యకు సీపీ తఫ్సీర్ ఇగ్బాల్ రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సురేష్‌కుమార్, ఏసీపీలు వెంకట్రావ్, ఈశ్వరయ్య సీఐలు వెంకన్నబాబు, రాజిరెడ్డి, రమేష్, ఎస్ఐ యల్లయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
సిద్దిపేటటౌన్ : వివిధ జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడిన అంతరాష్ట్ర దొంగను గజ్వేల్ పోలీసులు అరెస్టు చేసారు. ఈ సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ సోమవారం కమిషనరేట్‌లో నిందితుడికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, గజ్వేల్ ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో గజ్వేల్ రూరల్ సీఐ శివలింగం, ఎస్సై ప్రసాద్, సిబ్బందితో కలిపి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునేందుకు టీంను ఏర్పాటు చేసామన్నారు. స్పెషల్ టీం సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంతో కొంత మంది ఫోటోలు సేకరించి వారికోసం గాలిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం వర్గల్ కమాన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అంతర్రాష్ట్ర దొంగ అయిన బింగి మాధవరావు(55) పోలీసులను చూసి పారిపోబోయాడు. అది గమనించిన పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకొని విచారించగా అసలు విషయం ఒప్పుకున్నాడు. ఇతన్ని కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొత్తాబాద్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతను గతంలో కామారెడ్డి, జహీరాబాద్, షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 25 కేసులలో నిందితుడిగా ఉన్నట్లు సీపీ తెలిపారు. నిందితుడు అద్దెకు ఉంటున్న ఇంటిలో 22 తులాల బంగారం, కిలోన్నర వెండి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 8లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుడి వద్ద దొంగతనాలకు ఉపయోగించిన వస్తువులు లభ్యమయ్యాయి. అందులో ఒక కత్తి, ఐరన్ రాడ్, స్క్రూ డ్రైవర్, మిరపపొడి పాకెట్ లభించినట్లు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. కేసును చేధించిన గజ్వేల్ రూరల్ సీఐ శివలింగం, గౌరారం ఎస్సై ప్రసాద్, సిబ్బంది బాబు, హోంగార్డు విష్ణువర్దన్, సిట్ టీం యాదగిరి, రాంచంద్రారెడ్డి, ఉపేందర్, రామక్రిష్ణలను పోలీస్ కమిషనర్ అభినందించడంతో పాటు నగదు బహుమతి అందించారు. -
ఇంటికి కన్నం వేసిన పని మనిషి అరెస్ట్
అత్తాపూర్ : నమ్మకంగా పని చేస్తున్నాడు కదా అని ఇంటి పనులన్నీ అప్పజెప్పారు. అదే అదనుగా భావించిన ప్రబుద్ధుడు పని చేస్తున్న ఇంటికే కన్నం పెట్టాడు. ఇది గమనించిన ఇంటి యజమాని పో లీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన నగర శి వారులోని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శంషాబాద్ జోన్ డీసీపీ పద్మజ తెలిపిన వివరాల ప్రకారం... గండిపేట మండలం కిస్మత్పూర్ గ్రామంలోని ప్రెస్టేజ్ రాయల్ విల్లాస్ లోని 56వ ప్లాట్‌లో గత కొంతకాలంగా డాక్టర్ రా మకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. అయితే భార్యాభర్తలు ఉద్యోగులు కావడంతో ఇంట్లో వంట చేయడానికి తమకు తెలిసిన బంధువుల ద్వారా ఉప్పల్ ప్రాంతంలో ఉంటున్న రవి అనే వ్యక్తిని ఫిబ్రవరి మాసంలో వంట మనిషిగా పెట్టుకున్నారు. అదే అదనుగా భావించిన రవి.. దంపతులిద్దరూ ఉద్యోగానికి వెళ్లిన సమయంలో బీరువాలో ఉన్న 51 తులాల బంగారు ఆభరణాలు, రూ. 2 లక్షల నగదును దోచుకోని పరారయ్యాడు. సాయంత్రం ఇంటికొచ్చిన కుటుంబ సభ్యులు బీరువా తెరిచి ఉండడంతో ఇంట్లో దొంగతనం జరిగిందని గమనించి పని మనిషి రవికి ఫోన్ చేస్తే స్వీఛాప్ వచ్చింది. దీంతో అతనిపై అనుమానంతో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన రాజేంద్రనగర్ పోలీసులు, శంషాబాద్ జోన్ స్పెషల్ ఆపరేషన్ టీం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఉప్పల్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న రవిని అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన దొంగతనం చేసినట్టు అంగీకరించాడు. దొంగిలించిన సొమ్మును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ సురేష్, డిటెక్టివ్ ఆఫీసర్ అశోక్‌కుమర్ తదితరులు పాల్గొన్నారు. -
పోయిన బంగారు నగ దొరికింది
సాలూరు : పట్టణంలోని రాపాకవీధికి చెందిన సంగినేని సావిత్రి తన చేతి పర్సులో దాచుకున్న రెండున్నర తులాల బంగారు నక్లెస్‌ను జారవిడుచుకుంది. తిరిగిన రోడ్లన్నీ వెదికింది. ఫలితం లేకుండాపోయింది. బోరుమంటూ పట్టణ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు కొద్దిసేపటిలోనే పోగొట్టుకున్న నగను తిరిగి సావిత్రికి అప్పగించారు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...సావిత్రి తన చేతిపర్సులో భద్రంగా దాచుకుని బోసుబొమ్మ జంక్షన్ గుండా నడుచుకుంటూ వెళ్తూ పర్సును చేజార్చింది. కొద్దిసేపటికి పర్సును పోగొట్టుకున్న విషయం గుర్తించి గాలించింది. ఎవరి చేతికో చిక్కిందన్న విషయం గుర్తించి, చేసేది లేక పట్టణ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. కానిస్టేబుల్ హరి క్షణాల్లో ఆ ప్రాంతానికి చేరుకుని విచారించారు. సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించాడు. ఆ ప్రాంతంలోని వ్యాపారులను విచారించాడు. సీసీ పుటేజీలో తాము నగతీసిన వ్యక్తిని గమనించామని, తీసిన నగను తిరిగి ఇచ్చేయాలని, లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తప్పవని తనదైన శైలిలో హెచ్చరించడంతో కొద్ది క్షణాలలోనే పోగొట్టుకున్న పర్సుతో పాటు బంగారు నగ కూడా రోడ్డుపై ప్రత్యక్షమైంది. ఆ నగను ఏఎస్ఐ శ్రీనివాసరావు సావిత్రమ్మకు తిరిగి అప్పగించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఈ విషయమై పట్టణ ఎస్ఐ ఫకృద్దీన్ మాట్లాడుతూ చాకచక్యంగా వ్యవహరించి, నగను పోగొట్టుకున్న మహిళలకు తిరిగి దక్కేలా చేసిన కానిస్టేబుల్ హరికి పోలీసుశాఖ ద్వారా రివార్డు వచ్చేలా సిఫారసు చేస్తానని తెలిపారు. -
పోలీసులకు చిక్కిన మాయ లేడి
ద్వారకాతిరుమల : భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే క్షేత్ర పరిసరాల్లోనూ, ఆటోలు, బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల బ్యాగులను ఎంతో చాకచక్యంగా తెరచి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ మాయలేడిని అరెస్ట్ చేసినట్లు ఏలూరు డీఎస్పీ కె.ఈశ్వరరావు తెలిపారు. ఆమె వద్ద నుంచి రూ.5 లక్షల విలువైన 19 కాసుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో డీఎస్పీ గురువారం విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన జలతా లక్ష్మి ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో భక్తుల బంగారు వస్తువులను చోరీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే చేబ్రోలు మండలం కైకరం గ్రామంలో ఆటోలో ప్రయాణిస్తూ ఆమె పలు దొంగతనాలకు పాల్పడినట్లు తమ విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. వీటికి సంబంధించి ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో మూడు, చేబ్రోలు పోలీస్టేషన్లో ఒక కేసు నమోదైనట్టు తెలిపారు. లక్ష్మిని పాత నేరస్తురాలిగా గుర్తించామని పేర్కొన్నారు. ఆమెను గురువారం ఉదయం స్థానిక కుంకుళ్లమ్మను ఆలయం వద్ద భీమడోలు సీఐ బిఎన్.నాయక్ అరెస్ట్ చేసినట్టు వివరించారు. ఈ కేసులను ఛేదించిన సీఐ నాయక్‌ను, ద్వారకాతిరుమల ఎస్సై ఐ.వీర్రాజును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే దర్యాప్తుకు సహకరించిన ఐడీ పార్టీ సిబ్బంది హెడ్‌కానిస్టేబుల్ వసంతరావు, నాగేశ్వరరావు, రామచంద్రరావు, మురళీ తదితరులను ఆయన అభినందించారు. వీరికి రివార్డుల కోసం ఎస్పీ ఎం.రవిప్రకాష్‌కు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలి ఆలయాల వద్ద రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని డీఎస్సీ ఈశ్వరరావు అన్నారు. ఆలయ పరిసరాల్లో మరికొన్ని సీసీ కెమేరాల ఏర్పాటుకు ఆలయ అధికారులతో చర్చించామన్నారు. త్వరలో వాటిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అలాగే దొంగతనాల నియంత్రణకు సంబంధించి భక్తులకు పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తామని వివరించారు. -
ఎస్కేప్ కార్తీక్ అరెస్ట్...కిలో బంగారు స్వాధీనం
సాక్షి, బనశంకరి : ఇళ్ల తాళాలు బద్దలుకొట్టి చోరీలకు పాల్పడుతున్న ఘరానాదొంగ కార్తీక్ అలియాస్ ఎస్కేప్ కార్తీక్‌ను శనివారం ఈశాన్యవిభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.30 లక్షల విలువ చేసే బంగారు అభరణాలతో పాటు విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని అదనపు పోలీస్‌కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. శనివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీమంత్‌కుమార్‌సింగ్ వివరాలను వెల్లడించారు. కళ్యాణ నగర ప్రకృతి లేఔట్‌కు చెందిన ఎస్కేప్ కార్తీక్(28) కొత్తనూరు, హసన్, మైసూరు తదితర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడేవాడు. పోలీసులకు పట్టుబడిన కార్తీక్ నుంచి రూ.30 లక్షల విలువ చేసే ఒక కిలో బంగారు ఆభరణాలు, మూడు సెల్పోన్లు ను స్వాధీనం చేసుకున్నారు. హెణ్ణూరు కుమార్, జగన్ అనే ఇద్దరి తో కలిసి కార్తీక్ ఇళ్లులో చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కేవలం 6 తరగతితో చదువుకు స్వస్తిపలికిన కార్తీక్ 16 ఏళ్లు వయసులోనే చోరీలు చేయడం అలవాటు చేసుకున్నాడు. హెణ్ణూరులో ఓ ఇంటి కిటికీ బద్దలు కొట్టి లోనికి చొరబడిన కార్తీక్ రూ.10 లక్షల నగదు అపహరించుకెళ్లాడు. పెద్ద మొత్తంలో ఒకేసారి నగదు లబించడంతో చోరీలనే తన వృత్తిగా ఎంచుకున్నారు. సాయంత్రం సమయంలో తన అనుచరులతో కలిసి వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ తాళం వేసిన ఇళ్లును గుర్తించి రాత్రి సమయంలో తాళం బద్దలు కొట్టి చోరీలకు పాల్పడేవారు. చోరీ సొత్తును అట్టికాగోల్డ్, ముత్తూట్పైనాన్స్, ఇతర కుదువ దుకాణాల్లో కుదవపెట్టడం, బంగారుఆభరణాలు విక్రయించి విలాసవంతమైన జీవనం సాగించేవాడు. సెంట్రల్ క్రైంబ్రాంచ్ పోలీసులు 2007 లో కార్తీక్ ను అరెస్ట్ చేసి పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. జైలులో శిక్ష అనుభవిస్తూ ఖైదీలకు భోజనం సరఫరా చేయడానికి వచ్చిన కార్తీక్ ఇస్కాన్ సంస్ధ భోజనం అందించే వాహనంలో దాక్కుని పరారయ్యాడు. పరప్పన అగ్రహర పోలీసులు తీవ్రంగా గాలించి 45 రోజుల అనంతరం కార్తీక్‌ను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇతడికి ఎస్కేప్ కార్తీక్ గా పేరుపొందాడు. ఇప్పటివరకు ఇతడిపై నగరంతో పాటు వివిధ పోలీస్‌స్టేషన్లులో 70కి పైగా కేసులు నమోదు అయ్యాయని సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. -
విమానంలో కిలో బంగారం స్వాధీనం
పనాజి(గోవా): ఎయిరిండియా విమానంలో భారీగా బంగారం బయటపడింది. రోజువారీ విధుల్లో భాగంగా గోవా విమానాశ్రయంలో ఏఐ-994 విమానాన్ని ఇంటెలిజెన్స్ సిబ్బంది శుక్రవారం ఉదయం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విమానంలోని ఓ సీటు వెనుకభాగంలో అతికించి ఉన్న కవర్ కనిపించింది. దానిని తెరిచి చుడగా అందులో బంగారం ఉన్నట్లు గుర్తించారు. సుమారు 1280 గ్రాముల బరువున్న 11 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.34 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎవరూ బంగారం తమదేనంటూ రాలేదని చెప్పారు. ఈ నెలలో ఇటువంటి ఘటన జరగటం ఇది ఏడోసారి అని సిబ్బంది వివరించారు. తనిఖీల్లో దొరికిపోతానేమో అన్న భయంతో స్మగ్లింగ్ చేసిన వ్యక్తి బంగారాన్ని ఇలా సీటుకు అతికించి వెళ్లి ఉండొచ్చునని భావిస్తున్నారు. -
ఎంత తెలివిగా మోసం చేస్తున్నారు!
ముంబై: కేటుగాళ్లు తెలివి మీరిపోతున్నారు. రైళ్లల్లో, విమానాల్లో, ప్రైవేట్ వాహనాలలో ప్రయాణిస్తూ డ్రగ్స్, బంగారం లాంటివి పోలీసులు, నిఘా అధికారుల కళ్లుగప్పి అక్రమంగా తరలిస్తుంటారు. తాజాగా ఓ గ్యాంగ్ ఇలాంటి ప్రయత్నం చేయగా సిబ్బంది మాత్రం చాకచక్యంగా వ్యవహరించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని వారి గుట్టు రట్టు చేసింది. బ్యాగులు, షూలు, బాడీలో దాస్తూ తరచుగా విమానాలలో అక్రమంగా తరలించి చివరగా ఎయిర్ పోర్టు అధికారులకు దొరికిపోతుండటం చూస్తూంటాం. ముంబైలో 1048 గ్రాముల బంగారాన్ని కరిగించి ఎలక్ట్రికల్ జ్యూస్ మిక్సర్ లో పాత్రగా చేసి తీసుకెళ్తుంటే గుర్తించారు. ఓ వ్యక్తి అనుమానంగా కనిపించడంతో నిఘా అధికారులు అతడిని తనిఖీ చేయగా బ్యాగులో మిక్సర్ ఉన్నట్లు చూసి, పరిశీలించగా అందులో బంగారంతో ఉన్న పాత్రను గుర్తించారు. బంగారం ఇలా కూడా అక్రమరవాణా చేస్తారా అని వాళ్లు ఆశ్చర్యపోయారు. దీని బరువు కేజీ పైగా ఉందని, ఈ బంగారం విలువ దాదాపు రూ.28 లక్షల రూపాయలు ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
అంతర్జిల్లా దొంగల అరెస్ట్
రూ.8 లక్షలు బంగారు ఆభరణాలు, లారీ స్వాధీనం సూళ్లూరుపేట : సూళ్లూరుపేట, తడ మండలాల్లో పలు చోరీలకు పాల్పడిన ఇద్దరు అంతర్జిల్లా దొంగలను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సీఐ విజయకృష్ణ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. చిత్తూరు జిల్లా బుచ్చినాయుడుకండ్రిక వేణుగోపాలపురానికి చెందిన వరగంటి రమేష్ (28), తుపాకుల రమేష్ (23) సూళ్లూరుపేటలోని బస్టాండ్ సెంటర్లో అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. గత నెల 24న నెల్లూరు వెంకటేశ్వరపురానికి చెందిన ముగ్గురు మహిళలను నాయుడుపేటలో ఆటోలో ఎక్కించుకుని పెరిమిటిపాడు వద్ద అటవీ ప్రాంతంలో ఆపి దారి దోపిడీ చేసి యాస్మిన్ అనే మహిళ నుంచి బంగారు గొలుసు, కమ్మలు, సెల్‌ఫోన్ చోరీ చేశారు. వారి నుంచి ఆ వస్తువులను రికవరీ చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 18న తడ మండలం భీములవారిపాళెం వద్ద రోడ్డు పక్కన ఆపి ఉన్న అశోక్‌లైలాండ్ లారీని కూడా చోరీ చేసినట్లు విచారణలో వెల్లడి కావడంతో ఆ లారీని కూడా స్వాధీనం చేసుకున్నారు. మంగానెల్లూరు, పిచ్చాటూరు మండలంలోని అప్పంబట్టు, కేవీబీపురం పొలాల్లో మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి అందులోని కాపర్ వైర్లును చోరీ చేశారు. ఇందులో వరంగటి రమేష్‌పై చిత్తూరు జిల్లా సత్యవేడు, వరదయ్యపాళెం, బుచ్చినాయుడుకండ్రిగ, పిచ్చాటూరు, నెల్లూరు 5వ టౌన్ పోలీస్స్టేషన్లలో లారీల దొంగతనాలు కేసులు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, మోటార్ దొంగతనాల కేసులు ఉన్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్ఐ గంగాధర్‌రావు, ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎయిర్ పోర్ట్‌లో కిలో బంగారం పట్టివేత
చెన్నై: లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని చెన్నై ఎయిర్ పోర్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. అధికారుల వివరాల ప్రకారం... దుబాయ్ నుంచి వచ్చిన ఓ విమానంలో కేరళకు చెందిన ప్రయాణికుడు అష్రాఫ్ శనివారం ఉదయం చెన్నై విమానాశ్రయంలో దిగాడు. తన వద్ద ఉన్న మ్యూజిక్ సిస్టమ్‌లో ఒక కిలో బంగారాన్ని దాచి ఉంచి అక్రమంగా రవాణా చేస్తున్నాడు. కస్టమ్స్ అధికారులు విషయాన్ని గ్రహించి కేరళ ప్రయాణికుడ్ని తనిఖీ చేసి అతడ్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.25 లక్షల విలువ చేసే కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. -
దొంగతో దోస్తీ
ఇద్దరు స్నాచర్లలతో జతకట్టిన కానిస్టేబుల్ ముగ్గురినీ అరెస్టు చేసిన పోలీసులు మరో కేసులో ఇరానీ ముఠా సభ్యుడి పట్టివేత చందానగర్‌లో మరో చైన్ స్నాచర్ అరెస్టు మొత్తం 1.14 కేజీల బంగారు నగలు స్వాధీనం సాక్షి, సిటీబ్యూరో: దుండిగల్ బహుదూర్‌పల్లికి చెందిన కొండూర్ మోహన్ హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని నారాయణగూడ ఠాణాలో కానిస్టేబుల్.. ప్రస్తుతంగచ్చిబౌలిలోని మణికొండలో ఉంటున్నాడు. 2005 బ్యాచ్‌కు చెందిన ఇతను చైన్‌స్నాచర్లు బోరబండకు చెందిన మహమ్మద్ అహ్మద్ (బోరబండ), మహమ్మద్ ఫరూఖ్ (మాదన్నపేట)లను చేరదీశాడు. పోలీసులు పట్టుకుని ఠాణాకు తీసుకొచ్చే బైక్‌లను వారికి సమకూర్చి గొలుసు చోరీలు చేయించేవాడు. వచ్చిన డబ్బులో సగానికిపైగా తీసుకునేవాడు. అహ్మద్, ఫరూఖ్‌లను మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేసి విచారించగా 2015 జూన్ నుంచి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఐదు చైన్ స్నాచింగ్‌లు చేశారని, వీరికి నారాయణగూడ ఠాణా పోలీసు కానిస్టేబుల్ కె.మోహన్ సహకరించాడని వెలుగులోకి వచ్చింది. గురువారం సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, జాయింట్ సీపీ శశిధర్ రెడ్డి, క్రైమ్స్ ఓఎస్డీ నవీన్ కుమార్, బాలానగర్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... కస్టడీలోనే కలిశారు... గతేడాది జూన్‌లో ఓ ఇంటి చోరీ కేసులో సంతోష్ నాయక్ ముఠాను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. అందులో ఫరూఖ్ కూడా ఉన్నాడు. అప్పుడు కస్టడీలో ఉన్న ఫరూఖ్‌కు కానిస్టేబుల్ మోహన్ సన్నిహితుడయ్యాడు. జైల్లో ఉన్న ఫరూఖ్‌ను ములాఖత్ పేరుతో కలిశాడు. సొంత ఖర్చులతో బెయిల్ కూడా ఇప్పించాడు. ఆ తర్వాత బెయిల్ కోసం తాను చేసిన ఖర్చు తిరిగి ఇచ్చేందుకోసం చోరీలు చేయాలని మోహన్ ఫరూఖ్‌ను ప్రేరేపించాడు. అయితే జైల్లో ఉన్న తన స్నేహితుడు అహ్మద్‌ను కూడా బెయిల్‌పై బయటకు తీసుకొస్తే తాను చోరీలు చేయగలని ఫరూఖ్ స్పష్టం చేశాడు. దీంతో మోహన్ అహ్మద్‌ను ములాఖత్‌లో కలిసి అతడిని కూడా బెయిల్‌పై బయటకు తీసుకొచ్చాడు. బైక్.. నోకియా ఫోన్ ఇచ్చాడు... నారాయణగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల్లో ఉన్న ఓ సీబీజెడ్ బైక్‌తో పాటు సిమ్ కార్డు వేసి నోకియా ఫోన్‌ను ఫరూఖ్, అహ్మద్‌లకు ఇచ్చాడు. ఆ బైక్‌పై తిరుగుతూ ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు ఇద్దరూ మల్కాజిగిరి పోలీసు స్టేషన్ పరిధిలో మూడు స్నాచింగ్‌లు, నాచారం, మేడిపల్లి ఠాణా పరిధిల్లో రెండు స్నాచింగ్‌లు చేశారు. దొంగిలించిన సొత్తును మోహన్‌తో కలిసి పంచుకునేవారు. పట్టించిన బైక్... మల్కాజిగిరి ఠాణా పరిధిలోని ఆనంద్‌బాగ్ ప్రాంతంలో ఫరూఖ్, అహ్మద్‌లు బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారించగా గొలుసు చోరీలు చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. ఈ బైక్ ఎక్కడిది అని ఆరా తీయగా నారాయణగూడ పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ మోహన్ సమకూర్చాడని వెల్లడించారు. దీంతో నగర సీపీ మహేందర్‌రెడ్డికి సమాచారమిచ్చి మోహన్‌ను మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి పది తులాల బంగారంతో పాటు సీబీజెడ్ బైక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బియ్యం వ్యాపారి గొలుసు దొంగే... బియ్యం వ్యాపారం చేస్తున్న చందనగర్ పాపిరెడ్డి కాలనీకి చెందిన దొమ్మట రాంప్రసాద్‌ను సీసీఎస్ కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. జంట పోలీసు కమిషనరేట్లతో పాటు మెదక్‌లో 19 చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న రాంప్రసాద్ నుంచి 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇరానీ ముఠా సభ్యుడి అరెస్టు... మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ శ్రీరాంపూర్ పట్టణానికి చెందిన వాషీమ్ ఉస్మాన్ సయ్యద్‌ను సీసీఎస్ మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విచారించగా తన సహచరుడు హైదర్ గరీబ్షా ఇరానీతో కలిసి 22 చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డానని ఒప్పుకున్నాడు. పుణే, షిర్డీ, అహ్మద్‌నగర్, నాసిక్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోనూ గొలుసు చోరీలు చేశామని అంగీకరించాడు. ఇతడి నుంచి 43.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నాం. ఐదంచెల ప్రణాళికతో చైన్ స్నాచింగ్‌కు చెక్.... ఐదుగురు చైన్స్నాచర్లను పట్టుకోవడంతో 46 కేసులు పరిష్కారమయ్యాయి. 1.14 కేజీల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నాం. చైన్ స్నాచింగ్‌లను అరికట్టేందుకు ఐదంచెల ప్రణాళికను అమలు చేస్తున్నాం. గతేడాదితో పోల్చుకుంటే గొలుసు చోరీలు సగం తగ్గినా...తీవ్రత పెరగడంతో ప్రజల్లో,. మీడియాలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంటర్ స్టేట్ గ్యాంగ్‌లను పట్టుకునేందుకు ఏడు బృందాలు బయటనే పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు మూడు టీమ్‌లు సత్ఫలితాలనిచ్చాయి. ఇంటర్‌స్టేట్ గ్యాంగ్‌ల డాటా బేస్ రెడీ చేస్తున్నాం. లోకల్ నేరగాళ్ల వివరాల కోసం సర్వే ప్రారంభించబోతున్నాం. ఇవన్నీ సేకరించాక నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని నిందితుల వివరాలతో కలిపి డాటాబేస్ రెడీ చేస్తాం. చైన్ స్నాచర్లపై 392 దోపిడీ కేసు పెడుతున్నాం. ఇప్పటివరకు 49 మందిపై పీడీ యాక్ట్ పెట్టాం. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్ చక్కగా పనిచేస్తున్నాయి. - సీవీ ఆనంద్ , సైబరాబాద్ పోలీసు కమిషనర్ -
'బంగారు' దొంగ అరెస్ట్
345 గ్రాముల బంగారు నగలు స్వాధీనం వివరాలు వెల్లడించిన డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి తిరుచానూరు : తిరుచానూరు, తిరుమల పరిసరాల్లో భక్తుల నగలను చోరీ చేసిన ఓ మహిళను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి 345 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో తిరుపతి ఈస్టు డీఎస్పీ ఆర్.రవిశంకర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా బాపట్ల టౌన్, ఎన్‌ఎన్‌పీ అగ్రహారంనకు చెందిన వేజెండ్ల వెంకటలక్ష్మి కొన్నేళ్లుగా నేరాలకు పాల్పడుతోంది. ఈమె భర్త సాంబశివరావు గతంలో బాపట్ల మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా భర్త ప్రోత్సాహంతో ఆమె దొంగతనాన్ని ఎంచుకుంది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఓ భక్తురాలి నుంచి నగలను కాజేసింది. అలాగే 2013లో తిరుమలలో ఓ మహిళా భక్తురాలి నుంచి నగలు దొంగలిస్తూ పోలీసులకు పట్టుబడి జైలు శిక్ష అనుభవించింది. గతేడాది తిరుచానూరులో భక్తుల నగలను దొంగతనం చేయడంతో 7 కేసులు నమోదయ్యాయి. అలాగే తిరుపతి కూరగాయల మార్కెట్లో ఓ మహిళ వద్ద నుంచి సుమారు 28 గ్రాముల బంగారు నగలను చోరీ చేయడంతో తిరుపతి ఈస్టు పోలీస్స్టేసన్లోనూ కేసు నమోదయింది. ఇలా దొంగలించిన బంగారు నగలను అమ్మి తమ ఊర్లో ఇల్లు కొని స్థిరపడాలని నిశ్చయించుకున్నారు. దీంతో 23వ తేదీ భార్యాభర్తలిరువురు తిరుచానూరు చేరుకున్నారు. పూడి జంక్షన్ వద్ద క్యాష్ బ్యాగుతో అనుమానాస్పద స్థితిలో ఒంటరిగా నిల్చొని ఉన్న వెంకటలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు బయటపడ్డాయి. దీంతో ఆమెను అరెస్టు చేసి బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. భర్త సాంబశివరావును త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. -
బంగారం కాజేసే తోటికోడళ్లు అరెస్ట్
కాకినాడ: ప్రయాణికుల దృష్టి మరల్చి బంగారు ఆభరణాలు కాజేసే తోటికోడళ్లను తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పోలీసులు అరెస్టుచేశారు. పోలీసుల కథనం ప్రకారం... కాకినాడకి చెందిన ఇద్దరు తోటికోడళ్లు గత కొంత కాలం నుంచి బంగారం చోరీ చేస్తున్నారు. కాగా, శనివారం మహిళలను అనుమానించి, వారిని విచారించగా అసలు విషయం బయటపడింది. వారి నుంచి రూ.14.42 లక్షల విలువైన 67 కాసుల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిని అదుపులోనికి తీసుకుని, కేసు నమోదు చేశారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
రైళ్లలో చోరీలు.. కి‘లేడీ’ అరెస్ట్
సికింద్రాబాద్: రైళ్లలో మహిళా ప్రయాణికుల నగలు ఎత్తుకెళ్తున్న ఓ కి‘లేడీ’ని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. నిందితురాలి నుంచి రూ.1.65 లక్షల విలుల చేసే బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ అర్బన్ రైల్వే డీఎస్పీ పీవీ.మురళీధర్, ఇన్స్పెక్టర్ అంబటి ఆంజనేయులు కథనం ప్రకారం...గుంటూరు జిల్లా కొత్తపేట నాజ్సెంటర్కు చెందిన రమాదేవి అలియాస్ నాయుడమ్మ (40) ఉపాధి కోసం నగరానికి వచ్చింది. సరైన పని దొరక్కపోవడంతో రైల్వేస్టేషన్లు, రైళ్లలో చోరీలకు పాల్పడుతోంది. స్టేషన్ల ఆవరణలోను, రైళ్లలోనూ ప్రయాణికురాలిగా తిరుగుతూ ప్రయాణికుల నగలు కాజేస్తోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కారు పార్కింగ్ ప్రదేశంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న రమాదేవిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా రైళ్లలో చోరీ చేస్తున్నట్టు ఒప్పుకుంది. నిందితురాలి నుంచి 16.5 తులాల బంగారు నగలు రికవరీ చేశారు. అనంతరం ఆమెను రిమాండ్‌కు తరలించారు.